రాజధాని కోసం అమరావతిలో జరుగుతున్న ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న మరో రైతు గుండె ఆగింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన భారతి (55).. ఇన్నాళ్లూ అమరావతి కోసం ఐకాస నిర్వహిస్తున్న ఆందోళనల్లో పాల్గొన్నారు. కొన్నాళ్లుగా తీవ్ర మనస్తాపంతో ఉన్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. రాజధానిపై ఆలోచనలతోనే గుండెపోటుకు గురై చనిపోయారని ఆవేదన చెందారు.
ఇదీ చదవండి: