పశ్చిమ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఇవాళ, రేపు, ఎల్లుండి... ఉత్తర కోస్తాంధ్రలో, రాయలసీమలోని కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని విజయనగరం జిల్లా బడంగిలో 1.5 సెంటీమీటర్లు, శ్రీకాకుళం జిల్లా వంగరలో 1.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని పలు నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు...
నగరం | ఉష్ణోగ్రతలు |
విజయవాడ | 33 డిగ్రీలు |
విశాఖపట్నం | 33 డిగ్రీలు |
తిరుపతి | 34 డిగ్రీలు |
అమరావతి | 36 డిగ్రీలు |
విజయనగరం | 33 డిగ్రీలు |
నెల్లూరు | 36 డిగ్రీలు |
గుంటూరు | 34 డిగ్రీలు |
రాజమహేంద్రవరం | 34 డిగ్రీలు |
కర్నూలు | 32 డిగ్రీలు |
ఇదీచదవండి.