మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు 175 రోజులుగా నిరసన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని... తెదేపా సీనియర్ నేత నక్కా అనందబాబు అన్నారు. వైకాపా ప్రభుత్వం అమరావతిని ఏడారిగా మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని రాజధానిగా ప్రకటించాలని కోరతూ రాజకీయ, రాజకీయేతర ఐకాస ఆధ్వర్యంలో 175వ రోజు నిరాహార దీక్ష చేపట్టారు. గుంటూరు తెదేపా జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నిరాహారదీక్షను మాజీమంత్రి నక్కా ఆనంద బాబు ప్రారంభించారు.
అమరావతి ఉద్యమానికి సంఘీభావంగా రాష్ట్ర ప్రజలు ముందుకు రావాలని నక్కా ఆనందబాబు కోరారు. కరోనాని కారణంగా చూపించి ఉద్యమాన్ని అణిచివేయలని వైకాపా నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని ఆటంకాలు కల్గించినా అమరావతిని రాజధానిగా కొనసాగించే వరకు ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు.
175వ రోజు నిరాహారదీక్షకు సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, ఎమ్మెల్సీ రామకృష్ణ, సీపీఐ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఇవాళ సీఎం జగన్తో సినీ ప్రముఖుల భేటీ