అమరావతి ఉద్యమంపై నేడు ఐకాస నేతలు(Amaravathi jac members) తుళ్లూరులో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఉద్యమం ప్రారంభించి డిసెంబరు నాటికి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా నవంబరులో రైతులు చేపట్టబోయే మహా పాదయాత్ర, భవిష్యత్ ప్రణాళికపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి 29 గ్రామాల రైతులు, ఐకాస నాయకులు పాల్గొనున్నారు. హైకోర్టు నుంచి తిరుమల వరకు చేపట్టబోయే 45 రోజుల పాదయాత్ర ఏర్పాట్లు, ఉద్యమాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి..తదితర అంశాలను చర్చించనున్నారు.
పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే ఎలా వ్యవహరించాలనే అంశాలపైనా కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా పాదయాత్ర చేసి తీరాలని ఐకాస(Amaravathi jac meet) నేతలు, రైతులు భావిస్తున్నారు. ఈ 45 రోజులు పాదయాత్ర సమయంలో అమరావతికి వైకాపా ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించనున్నారు. అటు 664వ రోజు రైతులు, మహిళలు వివిధ గ్రామాల్లో నిరసన దీక్షలు కొనసాగించారు.
ఇదీ చదవండి: