పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెంలో మహిళలు గంగానమ్మకు బోనాలు సమర్పించారు. ర్యాలీగా వచ్చి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి విగ్రహం వద్ద అమరావతిని ఫ్లెక్సీని పెట్టి నైవేద్యాలు ఉంచారు. అమరావతి రాజధానికి వ్యతిరేకంగా జరుగుతున్నవన్నీ తొలగిపోవాలని మహిళలు వేడుకున్నారు. సర్వోన్నత న్యాయస్థానంలో రాష్ట్ర ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టేయాలని రైతులు అమ్మవారిని మొక్కుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ మనసు మార్చాలంటూ పూజలు చేశారు.
ఇవీ చదవండి...