పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు 303వ రోజు ఆందోళన కొనసాగించారు. తుళ్లూరు, వెలగపూడి, మందడం, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, వెంకటపాలెం, అబ్బరాజుపాలెం, అనంతవరం, ఐనవోలు గ్రామాల్లో దీక్షా శిబిరాల వద్ద ఆందోళన నిర్వహించారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.
ప్రస్తుత వర్షాలతో ముంబయి, హైదరాబాద్, చెన్నైలు మునిగినా ఇంతవరకు అమరావతిలో ఆ స్థాయి వరదలు రాలేదని.. ఒకవేళ వరదలు వచ్చినా అమరావతికి ఏం కాదన్నారు. వైకాపా ప్రభుత్వ వైఫల్యం వల్లే అక్కడక్కడ అడుగు లోతు నీళ్లు వచ్చాయన్నారు. ఇక్కడ ఏదో ఉపద్రవం వచ్చిందని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని రైతులు ఆరోపించారు. గత ప్రభుత్వం వరద నీరు బయటకు వెళ్లేలా పక్కా ప్రణాళికను అమరావతిలో ఏర్పాటు చేసిందని చెప్పారు.
ఇవీ చదవండి..