మందడం, తుళ్లూరు, వెలగపూడితోపాటు అనంతవరం, కృష్ణాయపాలెం ధర్నా శిబిరాల్లో అమరావతి నినాదాలు మారుమోగాయి. రాజధాని కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం భూములు ఇచ్చిన తమకు అన్యాయం జరిగిందని.. మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తమ జీవితాలతో చెలగాటమాడుతుందని రైతులు, మహిళలు ధ్వజమెత్తారు. ఎన్ని రోజులైనా తమకు న్యాయం జరిగే వరకు క్షేత్రస్థాయిలో పోరాడతామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలు అమరావతి ఉద్యమానికి సంఘీభావం తెలపాలని రైతులు, మహిళలు కోరారు.
ఇదీ చదవండి: వైరల్: తరగతి గదిలో.. స్నేహితుల సమక్షంలో.. మైనర్ల వివాహం!