మరింత ఉద్ధృతం అవుతున్న అమరావతి నిరసనలు రాజధానిగా అమరావతి కొనసాగాలని కోరుతూ తుళ్లూరు మండలం పెదపరిమిలో మహిళలు, రైతులు ఆందోళనబాటపట్టారు. నెలరోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణం కోసం భూమలు నిస్వార్థంతో ఇస్తే తమను అసభ్యంగా విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధానిని తరలించటానికి కమిటీల పేరుతో విష ప్రచారానికి దిగారని మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ వచ్చే శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమం మరింత తీవ్రం చేస్తామని హెచ్చరిచారు.ఇదీ చదవండి: 'ప్రత్యేక శాసనసభ సమావేశాలను అడ్డుకోండి'