ఏకైక రాజధానిగా అమరావతి రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు 577వ రోజుకు చేరాయి. వెలగపూడి, మందడం, తుళ్లూరు, అనంతవరం, నెక్కల్లు, బోరుపాలెం, వెంకటపాలెం, పెదపరిమి, ఉద్ధండరాయునిపాలెంలో నిరసన దీక్షలు కొనసాగాయి. ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులకు ముగ్గురు సీఎంలను నియమించాలని రైతులు ఎద్దేవా చేశారు.
రాష్ట్రానికి ఐదుగురు ఉపముఖ్యమంత్రులుంటే... ముగ్గురు ముఖ్యమంత్రులు ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. ఉద్ధండరాయునిపాలెం, లింగాయపాలెం, రాయపూడిలోని ఎస్సీలకు నెలవారి పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ... మూడు రాజధానులు అంశంపై జోక్యం చేసుకోవాలని కోరారు.
ఇదీచదవండి.