Alluri Sitarama Raju Jayanthi Celebrations: రాష్ట్ర వ్యాప్తంగా అల్లూరి సీతారామరాజు 126వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మన్యం వీరుడి జయంతిని పురస్కరించుకుని పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. ఈ క్రమంలో బాధల నుంచి భవిష్యత్తుకు మార్గం చూపించడమే అల్లూరి సీతారామరాజుకు మనం అందించే అసలైన నివాళి అని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలిచి, వారిలో చైతన్యం కలిగించాలని ఆయన సూచించారు.
-
విప్లవజ్యోతి, భారత జాతీయోద్యమానికి స్ఫూర్తి ప్రదాత, తెలుగువారి సాహసానికి ప్రతీక అల్లూరి సీతారామరాజు 126వ జయంతి సందర్భంగా... ఆ తెలుగు వీరుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలిచి, వారిలో చైతన్యం కలిగించి... బాధల నుండి భవిష్యత్తుకు… pic.twitter.com/GShPNE9nFz
— N Chandrababu Naidu (@ncbn) July 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">విప్లవజ్యోతి, భారత జాతీయోద్యమానికి స్ఫూర్తి ప్రదాత, తెలుగువారి సాహసానికి ప్రతీక అల్లూరి సీతారామరాజు 126వ జయంతి సందర్భంగా... ఆ తెలుగు వీరుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలిచి, వారిలో చైతన్యం కలిగించి... బాధల నుండి భవిష్యత్తుకు… pic.twitter.com/GShPNE9nFz
— N Chandrababu Naidu (@ncbn) July 4, 2023విప్లవజ్యోతి, భారత జాతీయోద్యమానికి స్ఫూర్తి ప్రదాత, తెలుగువారి సాహసానికి ప్రతీక అల్లూరి సీతారామరాజు 126వ జయంతి సందర్భంగా... ఆ తెలుగు వీరుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలిచి, వారిలో చైతన్యం కలిగించి... బాధల నుండి భవిష్యత్తుకు… pic.twitter.com/GShPNE9nFz
— N Chandrababu Naidu (@ncbn) July 4, 2023
Alluri Statue: 30 అడుగుల విగ్రహం.. రూ.3 కోట్ల వ్యయం
మరోవైపు భారత జాతీయోద్యమానికి స్ఫూర్తి ప్రదాత, తెలుగువారి సాహసానికి ప్రతీకైన అల్లూరి సీతారామరాజుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ నివాళులర్పించారు. ఈ క్రమంలో 'తెలుగు వీర లేవరా.. దీక్షబూని సాగరా.. దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా..' అని పిలుపునిచ్చి స్వతంత్ర పోరాటాన్ని ముందుండి నడిపించిన మన్యం వీరుడంటూ అల్లూరిని కొనియాడారు. దీంతోపాటు రాష్ట్ర ప్రజల స్వేచ్ఛ కోసం ప్రాణాలను పనంగా పెట్టిన త్యాగధనుడు అల్లూరి సీతారామరాజు 126వ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుందామని లోకేశ్ పిలుపునిచ్చారు.
-
"తెలుగు వీర లేవరా..దీక్షబూని సాగరా ..దేశమాత స్వేచ్చ కోరి తిరుగుబాటు చేయరా" అని పిలుపునిచ్చి, స్వతంత్ర పోరాటాన్ని ముందుండి నడిపారు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. మన స్వేచ్ఛ కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టిన త్యాగధనుడు అల్లూరి సీతారామరాజు 126వ జయంతి సందర్భంగా పోరాటయోధుడిని… pic.twitter.com/KAygJWA7FY
— Lokesh Nara (@naralokesh) July 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">"తెలుగు వీర లేవరా..దీక్షబూని సాగరా ..దేశమాత స్వేచ్చ కోరి తిరుగుబాటు చేయరా" అని పిలుపునిచ్చి, స్వతంత్ర పోరాటాన్ని ముందుండి నడిపారు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. మన స్వేచ్ఛ కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టిన త్యాగధనుడు అల్లూరి సీతారామరాజు 126వ జయంతి సందర్భంగా పోరాటయోధుడిని… pic.twitter.com/KAygJWA7FY
— Lokesh Nara (@naralokesh) July 4, 2023"తెలుగు వీర లేవరా..దీక్షబూని సాగరా ..దేశమాత స్వేచ్చ కోరి తిరుగుబాటు చేయరా" అని పిలుపునిచ్చి, స్వతంత్ర పోరాటాన్ని ముందుండి నడిపారు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. మన స్వేచ్ఛ కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టిన త్యాగధనుడు అల్లూరి సీతారామరాజు 126వ జయంతి సందర్భంగా పోరాటయోధుడిని… pic.twitter.com/KAygJWA7FY
— Lokesh Nara (@naralokesh) July 4, 2023
భారతీయుడి సత్తా చూపిన వీరుడు అల్లూరి: చంద్రబాబు
పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం తేతలి గ్రామంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 126వ జయంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన క్షత్రియ యువత ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆ పోరాటయోధునికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏటికొప్పాక బొమ్మలకు ప్రపంచ ప్రాచుర్యం కల్పించిన పద్మశ్రీ చింతలపాటి వెంకటపతి రాజు, విశ్వహిందూ పరిషత్ ఉత్తరాంధ్ర ప్రాంత కార్యదర్శి తనికెళ్ల సత్యరవి కుమార్లు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజేష్ డయాబెటిక్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మధుమేహం, రక్తపరీక్షలు నిర్వహించి పేషెంట్లకు ఉచితంగా మందులు అందజేశారు. అల్లూరి జయంతి వేడుకల్లో చిన్నారులు ధరించిన వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అల్లూరి విగ్రహం దిమ్మను ఢీకొట్టిన ఇన్నోవా... కారులో 2 కేజీల గంజాయి
ఇదే రీతిలో పలు జిల్లాల్లో అల్లూరి 126వ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా పలు సాంస్కృతి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆయా ప్రాంతాల రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆదివాసీల హక్కుల కోసం ముందుండి పోరాడిన మన్యం యోధుడు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి ఘననివాళులు అర్పించారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా కర్నూలులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పోరాటాలను స్మరించుకున్నారు.