ముఖ్యమంత్రి జగన్ నివాస ప్రాంతంలోని బకింగ్ హామ్ కాలువ పక్కనే ఉంటున్న అమరారెడ్డి నగర్ వాసులకు లాటరీ పద్ధతిలో ఇళ్లను కేటాయించారు. మంగళగిరి - తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డిలు ర్యాండమ్ పద్ధతిలో లబ్ధిదారులతో లాటరీ తీయించారు.
ముఖ్యమంత్రి భద్రత కోసమే అమరారెడ్డినగర్ వాసులను మంగళగిరి మండలం ఆత్మకూరుకు తరలిస్తున్నామని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో లబ్ధిదారులకు అన్ని సదుపాయాలు కల్పించామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. మొత్తం 283 మంది లబ్ధిదారులకు అన్ని వసతులు అందించిన తర్వాత వాళ్లకు అనుకూల సమయంలో ఇళ్ల నిర్మాణం చేసుకోవచ్చన్నారు.
ఇదీ చదవండి