రాష్ట్ర బడ్జెట్లో అగ్రిగోల్డ్ బాధితులకు 200 కోట్ల రూపాయలే కేటాయించటంపై... అగ్రిగోల్డ్ బాధితులు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావును ముందస్తు అరెస్టు చేసి, మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. రహదారులపైకి వస్తున్న అగ్రిగోల్డ్ బాధితులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు.
ఇదీ చదవండి: వైకాపాలో ‘ఎంపీ’ కలకలం