గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం నుదురుపాడు గ్రామంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో గ్రోమోర్ కేంద్రాల్లో యాంత్రీకరణ సేవలు ప్రారంభం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ హాజరయ్యారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఆయన తెలిపారు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఎన్నో రకాల సేవలను ఇస్తుందని చెప్పారు. వ్యవసాయ రంగంలో నకిలీని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గానికి ఒక ప్రయోగశాల (ల్యాబ్) ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రయోగశాలలు రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటాయని ఆయన తెలిపారు.
కోరమండల్ ఇంటర్నేషనల్ సంస్థ సేవలను కమిషనర్ అభినందించారు. ఆ సంస్థ రూపొందించిన భూమ్ స్ప్రేయర్‌ను కమిషనర్ ప్రారంభించారు. దాని పనితీరు తెలుసుకున్నారు. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు పథకాల గురించి ఏడీఏ అమల కుమారి వివరించారు. ఈ కార్యక్రమంలో డీడీఎ రామాంజనేయులు కోరమండల్ యాంత్రీకరణ సేవల మేనేజర్ జైకర్, జోనల్ మేనేజర్ సురేశ్ సంస్థ ప్రతినిధులు.. పాల్గొన్నారు.
ఇదీ చదవండీ.. RRR: ప్రత్యేక హోదాపై ఎంపీలంతా రాజీనామాకు సిద్ధమే: ఎంపీ రఘురామ