ETV Bharat / state

"మనకొచ్చే పాపులారిటీ వల్ల కూడా కొన్ని సమస్యలొస్తాయి"

Vijay Deverakonda attended the ED investigation

author img

By

Published : Nov 30, 2022, 11:34 AM IST

Updated : Dec 1, 2022, 12:36 PM IST

11:29 November 30

లైగర్ చిత్రంపై విజయ్‌ను ప్రశ్నించిన ఈడీ అధికారులు

విజయ్‌ దేవరకొండ, సినీ నటుడు

Vijay Devarakonda for ED investigation: "మనకొచ్చే పాపులారిటీ వల్ల కూడా కొన్ని సమస్యలొస్తాయి. వాటిల్లో ఇదొకటి.. మీరు చూపించే అభిమానం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. జీవితంలో ఇదొక అనుభవం. ఈడీ అధికారులకు పూర్తిగా సహకరించా. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చా.. నన్ను మళ్లీ రమ్మని చెప్పలేదు’’ ఈడీ అధికారులు 11 గంటల పాటు ప్రశ్నించిన తరువాత మీడియాతో విజయ్‌ దేవరకొండ చెప్పిన మాటలివి.

లైగర్ సినిమాకు పెట్టుబడుల వ్యవహారంలో ఫెమా నిబంధనలు అతిక్రమించారనే ఆరోపణలపై ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సినీ నటుడు విజయ్‌ దేవరకొండను 11 గంటల పాటు విచారించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన విచారణ 11 గంటల పాటు సాగింది. కొద్దినెలల క్రితం ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన ‘లైగర్‌’ సినిమా లావాదేవీల విషయంలో ఈడీ అధికారులు ప్రశ్నించారు. గతంలో ఈడీ విచారణకు ఆ చిత్ర దర్శకుడు పూరీజగన్నాథ్‌, ఛార్మి హాజరయ్యారు.

లైగర్‌ సినిమాకు సంబంధించిన వ్యవహారంలో దుబాయికి డబ్బులు పంపించి అక్కడి నుంచి తిరిగి సినిమాలో పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ అధికారులు గతంలో ప్రాథమికంగా గుర్తించారు. ఈ వ్యవహారంలో ఓ రాజకీయ నేత ప్రమేయం కూడా ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే ‘లైగర్‌’ సినిమా నిర్మాణంలో భాగస్వాములైన వారిని అధికారులు విచారిస్తున్నారు. లైగర్ సినిమా బడ్జెట్​కు సమకూరిన నిధులపై ఈడీ ఆరా తీస్తోంది. సినిమా కోసం విదేశాల నుంచి పెట్టుబడుల విషయంలోను విజయ్​ను ఈడీ ప్రశ్నించింది.

"ఈడీ అధికారులు విచారణకు పిలిచారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను. ఈడీకి పూర్తిగా సహకరించాను, మళ్లీ రమ్మని చెప్పలేదు. మీరు చూపించే అభిమానం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. పాపులారిటీ వల్ల వచ్చే కొన్ని సమస్యల్లో ఇదొకటి." - విజయ్‌ దేవరకొండ, సినీ నటుడు

ఇవీ చదవండి:

Last Updated : Dec 1, 2022, 12:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.