ETV Bharat / state

సర్పంచ్​ భర్తపై దాడి దారుణం.. 24 గంటల్లో అరెస్ట్ చేయకుంటే ఆందోళన: తెదేపా - Vaikapa leaders attack on Sarpanch's husband news

గుంటూరు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరు గ్రామ సర్పంచ్ భర్త సోమశేఖర్​పై.. వైకాపా నాయకులు దాడి చేశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహించారు. ఇరవై నాలుగు గంటల్లో దోషులను అరెస్టు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

achennayudu
అచ్చెన్నాయుడు
author img

By

Published : Jun 15, 2021, 10:49 AM IST

Updated : Jun 15, 2021, 2:12 PM IST

గుంటూరు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరు గ్రామంలో సర్పంచ్​ భర్త సోమశేఖర్​పై జరిగిన దాడిపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వైకాపా నాయకుల పనే అన్నారు. అభివృద్ధి పనులు చేస్తే దాడులు చేస్తారా అంటూ నిలదీశారు. రెండు నెలల్లో ఆరు సార్లు దాడి జరిగినా... ఇప్పటి వరకూ కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన రాయపాటి శివను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్​ చేశారు.

ముఖ్యమంత్రి నివాసం వద్ద, హోం మంత్రి సొంత జిల్లాలో ఇలాంటి దాడులు జరగటం సిగ్గుచేటని విమర్శించారు. ఇరవై నాలుగు గంటల్లో దోషులను అరెస్టు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. రాజధాని అంశాన్ని నీరుగార్చేందుకే జగన్ రెడ్డి దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధిలో కాకుండా అరాచకాలు, ఆకృత్యాలు, అన్యాయాల్లో రాష్ట్రాన్ని ముందంజలో ఉంచారని విమర్శించారు. ఎక్కడోచోట వైకాపా నేతలు నిత్యం దాడులు, దౌర్యన్యాలకు తెగపడుతుండటం ఫ్యాక్షన్ పాలనకు సాక్షమన్నారు. తెదేపాను అణగతొక్కటం జగన్​రెడ్డి తరం కాదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 'తెలంగాణ మాదిరే.. ఏపీకి సైతం తగిన నిర్ణయం తీసుకోండి'

Last Updated : Jun 15, 2021, 2:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.