ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి.. మేజర్​ కాల్వలోకి దూసుకెళ్లిన కారు - నార్కట్​పల్లి- గుంటూరు హైవేపై ప్రమాదం తాజా వార్తలు

కారు అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొని పక్కనే ఉన్న మేజర్​ కాల్వలో బోల్తాపడిన ఘటన నార్కట్​పల్లి- అద్దంకి హైవేపై చోటు చేసుకుంది. ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.

accident happened at narketpalli- addanki highway
నార్కట్​పల్లి- గుంటూరు హైవేపై ప్రమాదం
author img

By

Published : Oct 27, 2020, 10:47 PM IST

రొంపిచర్ల మండలం సంతగుడిపాడు గ్రామం వద్దనున్న అన్నవరం మేజర్​ కాలువ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బెంగళూరుకు చెందిన ఆర్మీ అధికారి కర్నల్​ రామ రఘునందన్​ ఉద్యోగరీత్యా హైదరాబాద్​లో ఉంటున్నారు. చెన్నైలో తమ బంధువుల ఇంట్లో జరిగే వివాహానికి కుటుంబ సభ్యులతో కలిసి కారులో బయలుదేరారు.

సంతగుడిపాడు గ్రామం వద్దనున్న అన్నవరం మేజర్​ కాలువ వద్ద అదుపుతప్పిన కారు.. అటుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి... మేజర్​ కాలువలోకి దూసుకుపోయింది. కారులో బెలూన్స్​ ఓపెన్​ అవ్వడం వల్ల క్షతగాత్రులకు ప్రాణాపాయ పరిస్థితి తప్పిందని ఎస్సై హాజరత్తయ్య తెలిపారు. క్షతగాత్రులను 108లో నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి :

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి, ఇద్దరికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.