ETV Bharat / state

మంచినీళ్లు అనుకుని తాగాడు.. ఆ తర్వాత ఏమైందంటే

Man Drinks Acid: పాత సీసాలు సేకరించి అమ్ముకునే వ్యక్తికి ఓ సీసా దొరికింది. అప్పటికే అతనికి దాహం వేసిందేమో.. ఆ బాటిల్​లోని నీటిని తాగాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంది. అదేంటో తెలుసా..

మంచినీళ్లు అనుకుని తాగాడు
మంచినీళ్లు అనుకుని తాగాడు
author img

By

Published : Nov 10, 2022, 7:33 PM IST

Man Drinks Acid: చాలా మంది దాహం వేసినప్పుడు నీటి కోసం వెతుకుతూ ఉంటారు. ఆ క్రమంలో ఎదైనా నీరు ఉన్న బాటిల్​ కనిపించగానే మూత తీసేసి దాహాన్ని తీర్చుకుంటారు. కానీ కొన్ని సమయాల్లో అందులో తాగే నీరు కాకుండా ఏమైనా హానికారక ద్రవాలు ఉండవచ్చు. ఇలాగే ఓ వ్యక్తి దాహంగా ఉందని.. మంచినీళ్లనుకొని పొరపాటున యాసిడ్‌ తాగాడు. ఈ ఘటన తెలంగాణలోని వరంగల్ రూరల్ జిల్లాలో చోటు చేసుకుంది.

వర్ధన్నపేట పట్టణంలోని వంశరాజ్ కాలనీకి చెందిన సాయిలు పాత సీసాలు సేకరించి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పాత బాటిల్స్ సేకరిస్తూ ఉండగా ఓ సీసా అతని కంటపడింది. అందులో ఉన్న నీటిని చూసి.. మంచినీళ్లు అనుకొని తాగాడు. కానీ అందులో ఉన్నది యాసిడ్ కావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో బాధితుడిని వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వరంగల్​లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.