విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం ఆకుల గణపవరం మండల పరిషత్ పాఠశాలలో వెంకటేశ్వర్లు అనే ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడు. ఈ విషయం తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి సదరు ఉపాధ్యాయుడిని నిలదీస్తే... అలాంటిది ఏమీ లేదని బుకాయించాడు. విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేసి...ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం అతడిని.. జిల్లా విద్యాశాఖాధికారి సస్పెండ్ చేశారు.
ఇదీచూడండి. 'మలేసియాలో ఉద్యోగం అని తీసుకెళ్లారు... చిత్రహింసలకు గురి చేశారు'