ETV Bharat / state

Snake: కాటేసిన పాముతో ఆసుపత్రికి.. ఆ తర్వాత ఏమైంది? - గుంటూరు జిల్లా ముఖ్యవార్తలు

తనను కాటేసిన పామును పట్టి, ఓ ప్లాస్టిక్ డబ్బాలో బంధించి పరుగున ఆసుపత్రికి వచ్చాడో వ్యక్తి. పామును పట్టుకుని దవాఖానాకు వచ్చాడని తెలుసుకున్న సిబ్బంది తొలుత భయపడినా, అనంతరం దాన్ని చూసేందుకు ఎగబడ్డారు.

కాటేసిన పాముతో ఆసుపత్రికి...ఆ
కాటేసిన పాముతో ఆసుపత్రికి...ఆ
author img

By

Published : Aug 19, 2021, 8:19 AM IST

గుంటూరు జిల్లా నందివెలుగులోని ఓ సిమెంటు రాళ్ల పరిశ్రమలో వీరాంజనేయులు అనే వ్యక్తి ట్రాక్టరు డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. బుధవారం రాళ్లను లోడ్​చేసే క్రమంలో ఆయన చేతిపై తాచుపాము కాటేసింది.

వెంటనే దాన్ని జాగ్రత్తగా పట్టుకుని ఒక డబ్బాలో వేసి మూత బిగించారు. డబ్బాతో సహా తెనాలి ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. అక్కడి సిబ్బంది వీరాంజనేయులు చికిత్స చేసి ప్రాణహాని లేదని భరోసా ఇచ్చారు. పామును జనసంచారం లేని ప్రదేశంలో వదిలిపెడతానని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:

school timings : పాఠశాలల పనివేళలు పెంపు... విద్యా సంవత్సరంలో 188 పని దినాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.