మితిమీరిన వేగంతో వెళ్తున్న ద్విచక్రవాహనం.. ముందుగా వెళ్తున్న మరో బైక్ ను ఢీకొట్టిన ఘటనలో.. ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉండే మంగాదేవి దంపతులతో పాటు లక్ష్మి అనే మహిళ కలిసి బైక్ పై.. నర్సీపట్నంలోని ఓ వేడుకకు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు.
పెద్ద బొడ్డేపల్లి ఆర్సీఎం చర్చి వద్దకు వచ్చేసరికి వెనుకనుంచి వేగంగా ఇద్దరు యువకులతో వస్తున్న మరో ద్విచక్ర వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న లక్ష్మి కిందపడి అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో క్షతగాత్రులను విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
DEPUTATIONS CANCEL: ఆ విభాగాల ఉద్యోగులకు... డిప్యుటేషన్లు రద్దు!