గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలోని గంగవరంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గంగవరానికి చెందిన తోట సత్యనారాయణ శనివారం రాత్రి పొలానికి వెళుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేసి హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం వేకువజామున పొలం నుంచి వస్తున్న వారు మృతదేహాన్ని గుర్తించి గ్రామస్తులు, కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని చెప్పులు, అన్నం క్యారేజీ, టార్చ్‌లైట్ మృతదేహం వద్ద పడి ఉన్నాయని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని.. దర్యాప్తు చేసి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు.
ఇదీ చదవండి: బొలెరో బోల్తా, ఓ బాలుడి మృతి