గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎన్‌ఎస్‌పీ కాలనీలో దారుణం జరిగింది. తాగిన మైకంలో భార్యను తల నరికి చంపాడు ఓ భర్త. ఎన్‌ఎస్‌పీ కాలనీకి చెందిన అంకమ్మ, శ్రీనివాసరావు భార్యభర్తలు. శ్రీనివాసరావు మంగళవారం రాత్రి తాగి ఇంటికి వెళ్లి.. భార్యతో గొడవపడ్డాడు. అతని వేధింపులు భరించలేక తాను పోలీసు స్టేషన్కు వెళ్తానంటూ అంకమ్మ బయలుదేరింది. ఆగ్రహంతో రగిలిపోయిన శ్రీనివాసరావు నడిరోడ్డుపై కత్తితో భార్య తల నరికి హత్య చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రహదారిపై ఉన్న మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. దారుణానికి ఒడిగట్టిన శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో లష్కర్గా పని చేస్తున్నాడు.
ఇదీ చదవండి