ETV Bharat / state

భార్యపై అనుమానంతో భర్త దాడి..దిశయాప్ ద్వారా సమాచారమిచ్చిన స్థానికులు - నరసరావుపేట

భార్యపై అనుమానంతో భర్త ఆమెపై దాడి చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగింది. దిశ యాప్ ద్వారా స్థానికులు సంఘటన గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించి ..చికిత్స చేయించారు.

A husband attack  on wife in narasaraopeta
బాధితురాలిని ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు
author img

By

Published : Jul 17, 2021, 8:48 AM IST

భార్యపై అనుమానంతో భర్త దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లా నరసరావుపేటలోని చంద్రబాబు నాయుడు కాలనీలో జరిగింది. స్థానిక మహిళలు వెంటనే దిశ యాప్ ద్వారా సమాచారం ఇవ్వడంతో... స్పందించిన నరసరావుపేట రెండో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ మహిళకు స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందించారు. కాలనీకి చెందిన రేష్మ అనే మహిళపై ...తన భర్త అనుమానంతో దాడి చేస్తున్నాడని స్థానికులు దిశ యాప్ ద్వారా మంగళగిరి కంట్రోల్ రూమ్​కు సమాచారమిచ్చారని సీఐ ఎస్ వెంకట్రావు తెలిపారు.

బాధితురాలికి అమ్మానాన్నలు లేకపోవడంతో తనకు అయ్యే వైద్యఖర్చులన్నీ తామే భరిస్తామని ఆయన వెల్లడించారు. రేష్మ భర్తను అదుపులోకి తీసుకున్నామని.. అతనిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెడతామని పేర్కొన్నారు. దిశ యాప్ వల్ల ఒక మహిళ ప్రాణాలు కాపాడమని అన్నారు. కాబట్టి ప్రతి మహిళ దిశ యాప్​ను తప్పనిసరిగా డౌన్​లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు.

ఇదీ చూడండి.
పొదుపు పాటిస్తూ.. ఆదాయం అర్జించేందుకు చర్యలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.