ఖాతాదారులతో పరిచయం పెంచుకుని వారి నుంచి ప్రైవేటుగాను, బ్యాంకుల్లోను లక్షల్లో అప్పులు చేసి తీర్చలేక చివరకు ఉద్యోగానికి రాజీనామా చేశాడు ఓ ఫీల్డు అసిస్టెంట్. గుంటూరు జిల్లా మేడికొండూరు భారతీయ స్టేట్ బ్యాంకు శాఖలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు లోనికి వచ్చింది.
సరాల శ్రీనివాస్ అనే ఓ వ్యక్తి జులై 2018లో మేడికొండూరు స్టేట్ బ్యాంకులో ఫీల్డు అసిస్టెంట్‌గా బాధ్యతలు చేపట్టాడు. క్రమంగా ఖాతాదారులతో పరిచయం ఏర్పడింది. దానిని అదునుగా చేసుకొని వ్యక్తి గతంగా అప్పులు చేయటం ఆరంభించారు. ఈ క్రమంలో అప్పు ఇచ్చిన వాళ్లు బ్యాంకు వచ్చి నిలదిసే వారు. దీంతో శ్రీనివాసు బ్యాంకుకు సక్రమంగా వెళ్లేవాడు కాదు. బాధితులు బ్యాంకు మేనేజరు దేవేంద్రనాధ్కి ఫిర్యాదు చేయగా ఈ విషయాన్ని ఉన్నతాధికారులు దృషికి తీసుకెళ్లాడు. దీనిపై అధికారులు విచారణ చేశారు.
శ్రీనివాస్ మేడికొండూరుకు చెందిన వ్యక్తులు వద్ద 24 లక్షలు దాకా అప్పులు చేశాడని తెలిసింది. అంతకు ముందు పని చేసిన గుంటూరు బ్రాంచిలో హౌసింగ్ లోన్ పేరిట 51 లక్షలు, మంగళగిరిలో ఎడ్యుకేషన్ లోన్ పేరుతో 10 లక్షలు, ఆత్మకూరు బ్రాంచ్‌లో 10 లక్షలు, విజయవాడ కో- అపరేటివ్ బ్యాంకులో రూ. 4 లక్షలు అప్పు చేశాడని తెలుసుకున్నారు. అంతే కాకుండాతోటి ఉద్యోగుల దగ్గర కూడా 10 లక్షలు అప్పు చేశాడని తెలిసి కంగుతిన్నారు. అధికారులు నిలదిస్తే, అనారోగ్యం అని చెప్పి ఉద్యోగానికి రాజీనామా చేసాడు.
దీంతో అప్పు ఇచ్చిన వారు లబోదిబోమని కోర్టు మెట్లు ఎక్కారు. ఉద్యోగ విరమణ అనంతరం రావలసిన డబ్బులు, బ్యాంకులో చేసిన అప్పులకు జమ చేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది. ఫీల్డు అసిస్టెంట్ కి ఇప్పుటికి బ్యాంకు రుణాన్ని ఇచ్చారు. మరికొందరు అదనపు సొమ్ము కూడా చెల్లించగా... ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తామని బ్యాంకు మేనేజరు తెలిపారు.
ఇదీ చదవండీ...అప్పుడు అప్పు తీర్చింది.. ఇప్పుడు ప్రాణం తీసింది..