తెనాలి పట్టణంలోని ఉప్పు బజార్లో ఇద్దరు బాలుర మధ్య వాగ్వాదం కత్తి పోటుకి దారి తీసింది. పునుగుల విషయంలో తలెత్తిన గొడవలో 16 ఏళ్ల బాలుడిని 10 సంవత్సరాల బాలుడు కత్తితో పొడిచి గాయపరిచాడు. కత్తిపోటుకు గురైన బాలుడిని స్థానికులు తక్షణమే తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మెరుగైన చికిత్స కోసం బాలుడిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. తీవ్ర గాయాలపాలైన ఆ బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న తెనాలి ఒకటో పట్టణ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
పునుగుల తింటుండగా గొడవ..
ఇద్దరు స్నేహితులు పునుగులు కొనుగోలు చేసి తింటూ ఉండగా.. వారి వద్దకు పదేళ్ల బాలుడు వెళ్లాడు. వెంటనే సదరు బాలురు అతనికి ఓ పునుగు ఇవ్వడంతో వివాదం మొదలైంది. నేనేమైనా అడుక్కునే వాడినా.. అంటూ వారితో పదేళ్ల బాలుడు గొడవకు దిగాడు. ఈ ఘర్షణలో పదేళ్ల బాలుడిని 16 ఏళ్ల బాలుడు చెంపపై కొట్టి అక్కడ నుంచి పంపిచేశాడు. అంతలోనే అక్కడ నుంచి వెళ్లినట్టే వెళ్ళిన అతను.. తిరిగి వచ్చి తన చెంపపై కొట్టిన బాలుడిని కత్తితో పొడిచి పారిపోయాడు.
ఇదీ చదవండి: