గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఉయ్యందన గ్రామ శివారు వాగులో 14 ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు. తాళ్లూరు గ్రామానికి చెందిన హేమంత్.. ఉయ్యందన వస్తూ మార్గమధ్యంలో చప్టా వాగులోకి దిగాడు. వాగు ఉద్ధృతికి బాలుడు ఒక్కసారిగా కొట్టుకుపోయాడు. స్థానికులు, పోలీసులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. హేమంత్ ఆచూకీ లభించకపోవటంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇదీచదవండి