గుంటూరు జిల్లాలో ఇవాళ కొత్తగా 601 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 22వేల 456కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే 173ఉన్నాయి. ఇక జిల్లాలోని మాచర్లలో 75, తెనాలి 43, మంగళగిరి 32, నర్సరావుపేట 30, బాపట్ల 23, ఈపూరు 23, కొల్లూరు 21, పెదనందిపాడు 19, చిలకలూరిపేట 17, వినుకొండ 16, దాచేపల్లి 13, ముప్పాళ్ల 14, సత్తెనపల్లిలో 12 కేసులు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో 90కేసులు వచ్చాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
కరోనా కారణంగా శనివారం నాడు 14మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకూ జిల్లాలో 211మంది చనిపోయినట్లయింది. కరోనా నుంచి 13వేల 38మంది కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. విధుల్లో ఉన్న పోలీసులు కరోనా బారిన పడుతుండటంతో అందరికీ కోవిడ్ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు గుంటూరులోని పోలీసు కళ్యాణ మండపంలో పరీక్షల కోసం ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఒక్కరోజే 290మంది పోలీసులు కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు.
ఇదీ చదవండి