ETV Bharat / state

పెనువిషాదం : కృష్ణా నదిలో మునిగి...ఆరుగురు మృతి - 6-students-missing

కృష్ణా నదిలో మునిగి...ఆరుగురు విద్యార్థులు మృతి
కృష్ణా నదిలో మునిగి...ఆరుగురు విద్యార్థులు మృతికృష్ణా నదిలో మునిగి...ఆరుగురు విద్యార్థులు మృతి
author img

By

Published : Dec 10, 2021, 7:27 PM IST

Updated : Dec 10, 2021, 10:37 PM IST

19:23 December 10

గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలో ఘటన

కృష్ణా నదిలో మునిగి...ఆరుగురు విద్యార్థులు మృతి

students death in guntur : గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలోని మాడిపాడు వద్ద పెనువిషాదం చోటు చేసుకుంది. గ్రామంలోని శ్వేత శృంగాచలం వేద వేదాంత గురుకుల వేద పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు కృష్ణా నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. ఈత రాకపోవడంతో వారంతా నదీ ప్రవాహంలో చిక్కుకుని గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న స్థానికులు పోలీసులు, గజఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టగా... ఆరుగురి మృత దేహాలు లభ్యమయ్యాయి.

ఈ ప్రమాదంలో సుబ్రహ్మణ్యం శర్మ, హర్షిత్ శుక్లా, శుభమ్ త్రివేది, అన్షుమాన్ శుక్లా, శివ శర్మ, నితీష్ కుమార్​లు మృతి చెందినట్లు గుర్తించారు. వీరిలో సుబ్రహ్మణ్యం శర్మ నరసరావుపేట, శివ శర్మ మధ్యప్రదేశ్ చెందిన వారు కాగా... మిగిలిన నలుగురు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు. ఈ ఘటనలో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను వారి వారి స్వస్థలాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

గవర్నర్ దిగ్భ్రాంతి...

students death in guntur : వేదపాఠశాల విద్యార్థుల మృతి పట్ల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, మంత్రి ఆదిమూలపు సురేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నారుల భద్రతపై సంస్థల నిర్వాహకులు శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇదీచదవండి.

Last Updated : Dec 10, 2021, 10:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.