గుంటూరు జిల్లాలో కొత్తగా 451 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కేసుల సంఖ్య 57 వేల 339కి చేరుకుంది. కొత్త కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 62, మంగళగిరిలో 59 కేసులు నమోదయ్యాయి. నరసరావుపేటలో 42, సత్తెనపల్లిలో 26, చేబ్రోలులో 22, ముప్పాళ్లలో18, నాదెండ్లలో 18, వినుకొండసో 15, నకరికల్లులో 14, పెదకూరపాడలో 13, రెంటచింతలలో 12, తెనాలిలో 12, కొల్లిపొరలో 10 కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో 128 కేసులు నమోదైనట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 49వేల 695 మంది ఇంటికి చేరుకున్నారు. వైరస్ ప్రభావంతో గుంటూరు జిల్లాలో మరో ఇద్దరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 536కు చేరింది.
ఇదీ చదవండి: