గుంటూరు జిల్లా కాకుమానులో హనుమాన్ జయంతి సందర్భంగా 45 అడుగుల శ్రీ ఏరువాక అభయాంజనేయ స్వామి భారీ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ గణపతి, ఆంజనేయ, వెంకటేశ్వర స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించి, హోమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది మందికి అన్నదానం చేశారు.
ఇది కూడా చదవండి