ఏలూరు జిల్లా దెందులూరు మండలంలో వైకాపా, తెదేపా వర్గాల మధ్య జరిగిన కొట్లాటకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్న మోర్ల వరకృష్ణ, చోడవరపు సాయి అజయ్‌కుమార్‌ల ఆచూకీ తెలియడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు పెట్టడంపై మంగళవారం రాత్రి వరకృష్ణ, సాయి అజయ్‌కుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అజయ్‌కుమార్.. ఘటన జరిగిన రోజున ఉదయం వేరే పనికి వెళ్లి రాత్రి పొద్దుపోయాక ఇంటికొచ్చి బంధువులతో కలిసి పార్వతీపురంలో పెళ్లికి వెళ్లడానికి ఏలూరు రైల్వే స్టేషన్‌కు వెళ్లగా గ్రామానికి చెందిన వ్యక్తులు బలవంతంగా తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారని తల్లి అచ్చమ్మ తెలిపారు. తమ కుమారుడు ఎక్కడున్నాడో చెప్పడం లేదని వరకృష్ణ తల్లి రంగమ్మ వాపోయారు.
పోలీసులు అదుపులోకి తీసుకుని 48 గంటలవుతున్నా కోర్టులో హాజరుపర్చలేదని వివరించారు. సంఘటనకు సంబంధించి శ్రీరామవరం, దెందులూరు గ్రామాల్లో పోలీసు పికెట్లు కొనసాగుతున్నాయి. 144 సెక్షన్ అమల్లో ఉండటంతో ఆయా గ్రామాలకు వచ్చే వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఘర్షణలో గాయపడ్డ వారిని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గురువారం పరామర్శించారు.
ఇవీ చూడండి: