ETV Bharat / state

ఛత్తీస్​గఢ్​ నుంచి టేకు అక్రమ రవాణా.. ఏపీకి చెందిన ముగ్గురు అరెస్ట్

Three persons arrested in Chhattisgarh: ఆంధ్రప్రదేశ్​కు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఛత్తీస్​గఢ్​ పోలీసులు వెల్లడించారు. ఆ రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4 లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

illegally transporting
illegally transporting
author img

By

Published : Jan 8, 2023, 10:56 PM IST

Illegally Transporting Teakwood from Chattisgarh: పుష్ప సినిమా తరహాలో కలప రవాణా అవుతున్న గుట్టును ఛత్తీస్​గఢ్​ అటవీశాఖాధికారులు రట్టు చేశారు. ఓ బాలికను కిడ్నాప్​ చేశారని సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వెంటనే వాహనాల తనిఖీలు చేపట్టి.. ఏపీకి అక్రమంగా టేకు కలపను రవాణా చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.4 లక్షల విలువ చేసే 126 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు అటవీ అధికారులు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్​లోని ఏలూరుకు చెందిన వ్యక్తులు గోలాకుబే ప్రాంతం నుంచి కలపను గడ్డి కింద కప్పి అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిపారు. చేపలు అమ్మేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఛత్తీస్​గఢ్​ సుక్మా ప్రాంతాని వచ్చే ఈ ముగ్గురూ.. అనంతరం అక్కడి కలపను అక్రమంగా రవాణ చేస్తున్నట్లు వెల్లడించారు. టేకు దుంగలకు సంబంధించిన పత్రాలు చూపకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. సుక్మా ప్రాంతంలో కలప స్మగ్లింగ్​పై అధికారులు నిఘా పెట్టడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు.

ఇవీ చదంవడి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.