ETV Bharat / state

Police Find 3 Months Old Decomposed Dead Body: వృద్ధురాలి మృతదేహంతో 3 నెలలు.. పిల్లి చనిపోయిందంటూ దుర్వాసనపై కహానీలు..

Police Find 3 Months Old Decomposed Dead Body: ఏలూరులో కుళ్లిపోయిన స్థితిలో పురుగులు పట్టి గుర్తుపట్టలేనంతగా ఓ వృద్ధురాలి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇంటిపై ఉన్న గదిలో వృద్ధురాలి మృతదేహం ఉండగా.. అదే ఇంట్లో కింది గదిలో ఉంటున్న తన కోడలికి విషయం తెలియకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కన్న కొడుకే కన్నతల్లిని చంపి విషయం బయటకు రాకూడదనే భయంతో సుమారు మూడు నెలలుగా ఆమె మృతదేహాన్ని ఇంటి పై గదిలో ఉంచాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

Police_Find_3_Months_Old_Decomposed_Dead_Body

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 27, 2023, 1:20 PM IST

Police Find 3 Months Old Decomposed Dead Body: ఏలూరు జిల్లాలో పోలీసులే నివ్వెరపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. కుళ్లిపోయిన స్థితిలో పురుగులు పట్టి గుర్తుపట్టలేనంతగా ఓ వృద్ధురాలి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇంటిపై ఉన్న గదిలో వృద్ధురాలి మృతదేహం ఉండగా.. అదే ఇంట్లో కింది గదిలో ఉంటున్న తన కోడలికి విషయం తెలియకపోవడంతో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కన్న కొడుకే కన్నతల్లిని చంపి విషయం బయటకు రాకూడదనే భయంతో సుమారు మూడు నెలలుగా ఆమె మృతదేహాన్ని ఇంటిపై గదిలో ఉంచాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరులోని తంగేళ్లమూడి యాదవ నగర్​లో బసవ దుర్గాప్రసాద్, అతని భార్య లలిత తన తల్లి నాగమణితో కలిసి జీవిస్తున్నారు. దుర్గాప్రసాద్ భార్య లలిత ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నారు. కాగా వారు నివసిస్తున్న ఇంటి నుంచి గత కొంతకాలంగా దుర్వాసన వస్తోంది. చుట్టుపక్కల వారు దుర్గాప్రసాద్, లలితను దుర్వాసన ఏంటని ప్రశ్నించగా పిల్లి చనిపోయిందంటూ చెబుతూ వచ్చారు. అయితే ఎంతకీ దుర్వాసన తగ్గకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Man Suspicious Death: చిత్తూరు జిల్లాలో ఓ డ్రైవర్​ అనుమానాస్పద మృతి.. యజమానే కారణమంటున్న కుటుంబసభ్యులు

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దుర్వాసన వస్తున్న ఇంటిపై పోర్షన్​కు వెళ్లి తలుపులు ఓపెన్ చేసి చూడగా అక్కడ కుళ్లిపోయిన స్థితిలో పురుగులు పట్టి వృద్ధురాలి మృతదేహం కనిపించింది. దాన్ని చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. ఆమె చనిపోయి సుమారు మూడు నెలలు అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని శరణార్థ నాగమణిగా పోలీసులు గుర్తించారు. ఆ ఇంటి కింద పోర్షన్​లోనే నాగమణి కొడుకు దుర్గాప్రసాద్, లలిత ఉంటున్నారు. కాగా ప్రస్తుతం మృతురాలి కుమారుడు దుర్గాప్రసాద్ పరారీలో ఉన్నాడు. మృతురాలి కోడలు లలిత మాత్రం తనకు ఏమీ తెలియదని, తన అత్తగారు తమకు చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయినట్లు భావిస్తున్నామని ఆమె చెప్పుకొచ్చారు.

కాగా వారు.. ఇంటి నుంచి వచ్చే దుర్వాసనపై స్థానికులు ప్రశ్నించినప్పుడు పిల్లి చనిపోయిందని.. అందుకే దుర్వాసన వస్తుందని చుట్టుపక్కల నమ్మించారు. ఇప్పుడు తీరా వృద్ధురాలి మృతదేహం బయటపడగానే.. కొడుకు దుర్గాప్రసాద్ పరారీలో ఉండటం, కోడలు లలిత తన అత్తగారు నాగమణి తమకు తెలియకుండా ఎక్కడికే వెళ్లిపోయిందని చెప్పడం చూస్తుంటే ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పోలీసులు కొడుకు దుర్గాప్రసాద్ తన తల్లిని చంపి.. భయంతో మృతదేహాన్ని పై పోర్షన్లో దాచి ఉంటాడని అనుమానిస్తున్నారు.

Student Suspicious Death: గిరిజన వసతి గృహంలో దారుణం.. నాలుగో తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి

ఘటనా స్థలానికి చేరుకున్న ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు.. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతురాలు నాగమణి మృతదేహాన్ని మూడు నెలలుగా దాచిపెట్టడానికి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, ఆమె సహజంగా మరణిస్తే ఎందుకు ఇన్ని రోజులు మృతదేహాన్ని ఎందుకు దాచి పెట్టారు..? ఒకవేళ ఇది హత్య..? అయితే దానికి గల కారణం ఏమిటి..? లేకపోతే ఆత్మహత్య..? అయితే మృతదేహం కుళ్లిపోయే వరకు పోలీసులకు ఇన్ని రోజులు ఎందుకు ఫిర్యాదు చేయలేదు.. ఇలా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Student Suspicious Death: స్కూల్​లో విద్యార్థి అనుమానాస్పద మృతి.. కొట్టి చంపేశారంటున్న తల్లిదండ్రులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.