ETV Bharat / state

Pawan Kalyan Comments on YS Jagan: జనసేన-టీడీపీ కలిస్తే భయమెందుకు..? ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తే చెప్తా: పవన్​

Pawan Kalyan Comments on ys Jagan: రాష్ట్రంలో అభివృద్ధిని సుస్థిరం చేసి.. అన్ని రకాలుగా ప్రగతిమార్గంలో నిలపాలన్న దృఢనిశ్చయంతోనే తెలుగుదేశంతో కలిసి అడుగులు వేస్తున్నామని పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపడం ఖాయమని ఆయన అన్నారు. నాలుగో విడత వారాహి యాత్రను ఏలూరు జిల్లా ముదినేపల్లిలో ముగించిన పవన్.. ప్రజల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్న సీఎం జగన్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

Pawan_Kalyan_Comments_on_ys_Jagan
Pawan_Kalyan_Comments_on_ys_Jagan
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 5, 2023, 8:53 PM IST

Updated : Oct 6, 2023, 10:36 AM IST

Pawan Kalyan Comments on YS Jagan: జనసేన-టీడీపీ కలిస్తే భయమెందుకు..? ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తే చెప్తా: పవన్​

Pawan Kalyan Comments on ys Jagan: ఒక రోడ్డు వేయలేని, వంతెన కట్టలేని సీఎం జగన్​కు ఓటెందుకు వేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వారాహి విజయయాత్రలో భాగంగా ఏలూరు జిల్లా ముదినేపల్లిలో నిర్వహించిన సభలో పాల్గొన్న పవన్ వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్​ను ఏర్పాటు చేస్తామని పునరుధ్టాటించారు. తాము ఎన్డీఏలో లేమంటూ వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2024లో తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని పవన్ స్పష్టం చేశారు.

ఏలూరు జిల్లా ముదినేపల్లిలో నిర్వహించిన వారాహి బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. జనసేన- టీడీపీ అధికారంలోకి రాగానే పెంచిన మద్యం ధరలు తగ్గిస్తామని పవన్‌ హామీ ఇచ్చారు. తాను మద్యం మొత్తం నిషేధిస్తానని సీఎం జగన్​ అబద్ధపు మాటలు చెప్పారని పేర్కొన్నారు. మహిళలు ముందుకొచ్చి అడిగినచోట ప్రతిచోట మద్యం నిషేధిస్తామని పవన్ పేర్కొన్నారు. మద్యపానం వద్దన్న గ్రామాలకు అదనపు నిధులు ఇచ్చేలా ఏర్పాటు చేస్తామని.. సర్పంచ్‌లు మద్య నిషేధం కోరితే అదనపు నిధులిస్తామని పవన్‌ పేర్కొన్నారు.

Pawan Kalyan Sensational Comments: జగన్​ ఏపీకి బంగారు భవిష్యత్తు కాదు.. విపత్తు: పవన్ కల్యాణ్‌

మద్యపానం పూర్తిగా నిషేధిస్తానని జగన్‌ హామీ ఇచ్చి ఇప్పుడు కల్తీ, నాసిరకం మద్యం అమ్మి ఆడపడుచుల పుస్తెలు తెంపుతున్నారని మండిపడ్డారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యత గల మద్యం పాత ధరలకే అమ్మేలా కొత్త విధానం తీసుకొస్తామన్నారు.

"175 కొట్టెస్తామని ఆత్మ విశ్వాసం ఉన్న వైసీపీకి.. జనసేన ఒక లెక్కా.. టీడీపీ ఓ లెక్కా. పైగా ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే పెద్ద మనుషులు మేము ఎన్టీఏ కూటమి నుంచి బయటకు వచ్చేశాం అని మాట్లాడుతుంటే. మేము ఎన్డీఏ కూటమిలో ఉంటే ఏంటీ.. దాని బయటుంటే ఏంటీ. మీరు మమ్మల్ని చూసి బయపడుతున్నారంటే.. మమ్మల్ని చూసి భయపడుతున్నారని అర్థం" -పవన్​ కల్యాణ్​, జనసేన అధినేత

Flexi Dispute Between Janasena and YCP in Pedana: పెడనలో వైసీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీల వివాదం.. రంగంలోకి దిగిన పోలీసులు

Pawan Kalyan fire on YCP MLA: ఐదేళ్లు అధికారంలో ఉంటేనే ఇక్కడి ఎమ్మెల్యే, ఆయన కుమారుడికి కొమ్ములు వచ్చాయని విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యే, ఆయన కుమారుడి కొమ్ములు విరిచి కింద కూర్చోబెడతామని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం మారిన రోజున కొల్లేరు మొత్తం శుద్ది చేస్తామన్న పవన్.. జనసేన, టీడీపీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో నీటి సమస్య తీర్చే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇంటర్‌ ధ్రువపత్రాలు ఇవ్వలేని వారికి ఓట్లడిగే హక్కు ఎక్కడిదని మండిపడ్డారు. కొల్లేరును వైసీపీ నేతలు కొల్లగొడుతున్నారని పవన్‌ మండిపడ్డారు

కైకలూరులోని ఓ వంతెన సమస్యలపై పవన్ స్పందించారు. ప్రభుత్వం వంతెన నిర్మాణానికి 80 శాతం ఖర్చు చేసినా.. వంతెన నిర్మాణం ఇప్పటికీ పూర్తికాలేదని విమర్శలు గుప్పించారు. రోడ్లు, వంతెనలు వేయలేని ముఖ్యమంత్రికి ఓట్లు వేయాలా? అంటూ ప్రశ్నించారు. ఒక్క వంతెన కట్టలేక 45 గ్రామాల ప్రజలు ఇబ్బంది పెడుతున్నారని పవన్ విమర్శలు గుప్పించారు.

TDP Leader Kollu Ravindra Fire on Police Notices: పవన్‌కు పోలీసుల నోటీసులపై కొల్లు రవీంద్ర ఆగ్రహం

Pawan Comments on Alliance: తాను ‘సీఎం కావడం కన్నా ప్రజల శ్రేయస్సే ప్రధానమన్న పవన్..సంక్షేమం పేరుతో మభ్యపెడుతున్న జగన్‌కు ప్రజలు బుద్ధి చెబుతారని మండిపడ్డారు. ఆయన నొక్కని బటన్లు కోకొల్లలని విమర్శించారు. వైసీపీ నేతలు మొత్తం 175 సీట్లు తమకే వస్తాయని చెబుతున్నారని.. మీరు అద్భుతంగా పాలిస్తే వచ్చే ఎన్నికల్లో గెలవాలని ఛాలెంజ్ చేశారు.

టీడీపీ, జనసేన కలిస్తే వైసీపీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. భయపడుతున్నారంటే మాకు బలం ఉందని ఒప్పుకున్నట్టేనని పవన్ ఎద్దేవా చేశారు. ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చామని వైసీపీ ప్రచారం చేస్తోందని.. ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తే మాత్రం.. చెప్పే వస్తానని పవన్‌ పేర్కొన్నారు. మేం ఎన్డీఏ కూటమిలో ఉంటే మీకేంటి.. లేకుంటే మీకేంటి? అంటూ వైసీపీ నేతలపై ప్రశ్నల వర్షం గుప్పించారు.

తనపై దాడి చేయడానికి కార్యాలయం చుట్టూ మోహరించారని పవన్ ఆరోపించారు. ఆ సమయంలో తాను పారిపోకుండా ఆఫీసులోనే కూర్చున్నానని.. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు నిలబడి ఉంటారా? లేదా? చూడండి అంటూ హెచ్చరించారు. వైసీపీ నేతలకు ధైర్యం ఉంటే.. జనసేన-టీడీపీ గెలిచాక మీరు మీ కార్యాలయాల్లోనే ఉండండి అంటూ ఎద్దేవా చేశారు. కైకలూరులో తన కోసం వచ్చే జన సైనికులను ఇబ్బందులకు గురి చేశారని పవన్ ఆరోపించారు. 2019లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని ఎదుర్కొని నిలబడ్డాను, జగన్​కు భయపడతానా అంటూ విమర్శలు గుప్పించారు.

Pawan Kalyan met Chandrababu in Rajahmundry Jail: జైల్లో చంద్రబాబుతో పవన్​కల్యాణ్​ ములాఖత్​.. భువనేశ్వరి, బ్రాహ్మణిలకు పరామర్శ

Last Updated : Oct 6, 2023, 10:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.