ETV Bharat / state

కాఫర్‌డ్యాం కొట్టుకుపోతే ఎవరు బాధ్యులు? - పోలవరం నిర్మాణంలో ఏపీ తీరుపై కేంద్రం ఆగ్రహం

Meeting on Polavaram Project Construction Works Issues in Delhi: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్రం తీరుపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. వద్దన్నా నీళ్లు నింపుతున్నారని, కాఫర్‌డ్యాం కొట్టుకుపోతే ఎవరు బాధ్యులని నిలదీసింది. గైడ్‌బండ్‌ కుంగడానికి బాధ్యత ఎవరిదో ఎందుకు నిర్ధారించలేదని ప్రశ్నించింది. ప్రాజెక్టు పనులపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ఇలానే వ్యవహరిస్తే, ఎగువ కాఫర్‌ డ్యాం మరమ్మతు పనుల డబ్బులివ్వబోమని హెచ్చరించింది.

Meeting_on_Polavaram_Project
Meeting_on_Polavaram_Project
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 6, 2023, 3:34 PM IST

Meeting on Polavaram Project Construction Works Issues in Delhi : పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంశాలపై కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, జలశక్తి శాఖ మంత్రి సలహాదారు వెదిరే శ్రీరామ్‌ దిల్లీలో సమావేశం నిర్వహించారు. ఏపీ నుంచి జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు హాజరయ్యారు. సమావేశమంతా చాలా సీరియస్‌గా జరిగింది. అనేక అంశాల్లో రాష్ట్ర అధికారుల తీరుపై దేబశ్రీ ముఖర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తిచేయాలన్నది ప్రస్తుత ప్రణాళిక అని అడిగారు. 2024 జూన్‌ నాటికి పూర్తి చేయాలని తమ ఉద్దేశమని ఏపీ అధికారులు చెప్పారు. ఇది ఆచరణాత్మక ప్రణాళికేనా అని ఆమె సీరియస్‌ అయ్యారు. ఎన్నో అంశాలు పరిష్కారం కావలసి ఉండగా అప్పటికి ప్రాజెక్టు పూర్తి చేయగలమని ఎలా అనుకుంటున్నారని ప్రశ్నించారు.

కాఫర్‌డ్యాం కొట్టుకుపోతే ఎవరు బాధ్యులు?-పోలవరం నిర్మాణంలో ఏపీ తీరుపై కేంద్రం ఆగ్రహం

Central Government Serious On AP Government About Polavaram Project : పోలవరంలో అంశాలపై ఏపీ అధికారులకు ఎన్నిసార్లు లేఖ రాసినా స్పందన లేదని, కేంద్ర జలశక్తి తమను బాధ్యులను చేస్తోందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ శివానందన్‌ కుమార్‌ సమావేశంలో తెలిపారు. ప్రాజెక్టులో నీళ్లు ఖాళీచేయాలని తాము ఎన్నిసార్లు లేఖ రాసినా పట్టించుకోలేదని ఆయన చెప్పడంతో కేంద్ర కార్యదర్శి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎగువ కాఫర్‌డ్యాం తీవ్ర సీపేజీ సమస్యతో కొట్టుకుపోయేలా ఉందని, నీళ్లు నింపడం ఎంత ప్రమాదమో తెలుసా? అని దేబశ్రీ ప్రశ్నించారు. కాఫర్‌డ్యాం కొట్టుకుపోతే ఎవరు బాధ్యులని ఆమె నిలదీశారు. ఎగువ కాఫర్‌డ్యాం మరమ్మతులకు, నీటిని ఎత్తిపోస్తున్న ఖర్చుల్ని కేంద్రం చెల్లించబోదని తేల్చిచెప్పారు.

'పోలవరం' ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం - రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు: అంబటి రాంబాబు

Polavaram Project Issues : ప్రైమ్‌ ఆఫ్‌ వీర సాఫ్ట్‌వేర్‌ వినియోగించాలని రెండేళ్లుగా చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని కేంద్ర కార్యదర్శి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సాఫ్ట్‌వేర్‌ అప్‌లోడ్‌ చేశామని, తేదీలు మాత్రమే అనుసంధానం చేయలేదని రాష్ట్ర అధికారులు చెప్పారు. తేదీలతో అనుసంధానం చేయకపోతే ఆ సాఫ్ట్‌వేర్‌ వల్ల ప్రయోజనం ఏంటని కేంద్ర అధికారి నిలదీశారు. దీనికి అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. మరో 15 రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఎగువ కాఫర్‌ డ్యాం సీపేజీ సమస్యపై అధ్యయనానికి తాము వెళ్లినప్పుడు అక్కడ అధికారులు గేలి చేస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారని CSMRS డైరెక్టర్‌ కేంద్ర కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. దీనిపై దేబశ్రీ మరింత ఆగ్రహానికి గురయ్యారు.

Central Government Serious on Polavaram Project Works : కేంద్ర జలశక్తి మంత్రి సలహాదారు వెదిరే శ్రీరామ్‌ సైతం పోలవరం పనుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటివరకు పనులు చేయకుండా ఎన్ని సీజన్లు వెళ్లిపోయాయో గుర్తించారా అని ఆయన నిలదీయగా, అధికారులెవరూ స్పందించలేదు. నాలుగు సీజన్లు నష్టపోయామని ఆయనే వెల్లడించారు. గైడ్‌బండ్‌ కుంగిపోవడానికి బాధ్యత ఎవరిదో ఇంకా నిర్ధారించలేదని వెదిరే శ్రీరామ్‌ ప్రస్తావించారు. ఇప్పుడు సీపేజీ సమస్య తలెత్తిందన్నారు. పోలవరంలో ఎంఓయూ కుదుర్చుకోకపోవడం వల్లే ఈ సమస్య పెరుగుతుందని కేంద్ర పెద్దలు పేర్కొన్నారు. తక్షణమే ఎంఓయూ కుదుర్చుకునేందుకు సహకరించాలని చెప్పారు.

పోలవరం నిర్మాణంపై ఆందోళన - కీలక పనులపై కొరవడిన స్పష్టత

Polavaram Project Status Today : పోలవరం పనులు చేస్తున్న మేఘా సంస్థ స్వీడన్‌ కంపెనీని కన్సల్టెంటుగా నియమించుకుందని అధికారులు చెప్పారు. వారు నిపుణుల సహకారం తీసుకోవడం మంచిదేనని, వారు ఇచ్చిన డిజైన్లకు రాష్ట్ర అధికారులే పూర్తి బాధ్యత తీసుకోవాలని కేంద్ర కార్యదర్శి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిపుణుల ఏజెన్సీ కోసం గ్లోబల్‌ టెండర్లు పిలిచిందని సమావేశంలో వెల్లడించారు. కొన్ని పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే ఎగువ కాఫర్‌డ్యాం, సీపేజీ అంశాలపై నిర్ణయం సాధ్యమవుతుందని అన్నారు.

Polavaram Project Current Status : పోలవరం ప్రాజెక్ట్‌ తొలిదశలో మొత్తం 31వేల625 కోట్ల రూపాయలకు కేంద్ర జలసంఘం ఇచ్చిన సిఫార్సులను రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ 10 రోజుల్లో పరిశీలించి నివేదిక ఇవ్వాలని కేంద్ర కార్యదర్శి ఆదేశించారు. ఆ తర్వాత పెట్టుబడుల అనుమతి కమిటీకి పంపిస్తామని తెలిపారు. ఆ నిధులు త్వరగా వచ్చేలా చూడాలని రాష్ట్ర అధికారులు కోరారు. కేంద్రం నిధులు త్వరగా ఇస్తేనే అన్ని పనులూ పూర్తి చేయడం సాధ్యమవుతుందని రాష్ట్ర అధికారులు తెలిపారు. మరో 15 రోజుల్లో సమావేశం ఏర్పాటు చేస్తామని కేంద్ర కార్యదర్శి తెలిపారు.

CM Jagan Silence on Polavaram Project: సీఎం జగన్ మౌనముద్ర.. పోలవరం ప్రాజెక్ట్​కు వేల కోట్ల రూపాయల నష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.