ETV Bharat / state

వారిపై తొందరపాటు చర్యలు వద్దు.. పోలీసులకు హైకోర్టు ఆదేశం - AP High Court

High Court directed the police not to take hasty action: పేదవేగి మండలం కొప్పాక సమీపంలో అక్రమ మట్టి తవ్వకాల వద్దకు చింతమనేని వ్యక్తిగత సహాయకుడు శివబాబు వెళ్లగా పోలీసులు ఏలూరు టూటౌన్ పీఎస్​లో శివబాబుతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఆకేసులను సవాల్ చేస్తూ పిటీషనర్లు కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశాగా పిటీషన్ పై విచారించిన ధర్మాసనం పిటీషనర్ల పై తొందరపాటు చర్యలు చేపట్టొద్దని పోలీసులను ఆదేశించింది.

high court
high court
author img

By

Published : Dec 13, 2022, 6:17 PM IST

High Court Direction to Police: తమపై నమోదైన కేసును కొట్టి వేయాలని కోరుతూ టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్​ వ్యక్తిగత సహాయకుడు శివబాబుతో పాటు మరికొందరు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్​పై విచారించిన ధర్మాసనం.. పిటిషనర్లపై తొందరపాటు చర్యలు చేపట్టొద్దని పోలీసులను ఆదేశించింది. పిటిషనర్ల తరుపు సీనియర్ న్యాయవాది పోసాని వేంకటేశ్వర్లు వాదనలు వినిపించారు . పిటిషనర్లపై అన్యాయంగా కేసు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. గాయపడిన వారిపైనే పోలీసులు కేసు నమోదు చేశారన్నారు.

ఇటీవల పేదవేగి మండలం కొప్పాక సమీపంలో అక్రమ మట్టి తవ్వకాల వద్దకు శివబాబు వెళ్లారు. ఈ క్రమంలో పేదవేగి, ఏలూరు టూటౌన్ పీఎస్​లో శివబాబుతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఆ కేసులను సవాల్ చేస్తూ పిటిషనర్లు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.