ETV Bharat / state

మొన్నేమో 173.. ఇప్పుడేమో 379 వంటకాలు.. ఏంటో గోదారోళ్ల మర్యాదలు

379 types of dishes: గోదారోళ్లు అంటేనే మర్యాదలకు మారుపేరు అని చెప్తుంటారు.. చెప్పడం ఏంటండీ నిజమే కదా. ఒకవేళ మీరు తెలుసుకోవాలి అనుకుంటే గోదావరి జిల్లాకి వెళ్లాల్సిందే.. లేదా అల్లుడైనా అవ్వాలి. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చారు అంటే చాలు వారికి ఎక్కడ ఏమి తక్కువ కాకుండా అతిథి మర్యాదలు చేస్తారు.. ఇక అలాంటిది సంక్రాంతి సమయంలో ఇంటికి కొత్త అల్లుడు వస్తే ఇంక మామూలుగా ఉండదు. వామ్మో గోదారోళ్ల మర్యాదలకు చూపించే ప్రేమకు భయపడి పోవాల్సిందే. అదే రీతిలో ఏలూరులో సంక్రాంతికి ఇంటికి వచ్చిన కొత్తల్లుడికి 379 రకాల వంటకాలతో విందు భోజనం వడ్డించి ఆశ్చర్యపరిచారు.

379 types of dishes
మొన్నేమో 173.. ఇప్పుడేమో 379 వంటకాలు.. ఏంటో గోదారోళ్ల మర్యాదలు
author img

By

Published : Jan 16, 2023, 11:04 PM IST

మొన్నేమో 173.. ఇప్పుడేమో 379 వంటకాలు.. ఏంటో గోదారోళ్ల మర్యాదలు

379 types of dishes: సంక్రాంతికి ఇంటికి వచ్చిన కొత్తల్లుడికి 379 రకాల వంటకాలతో విందు భోజనం వడ్డించి ఆశ్చర్యపరిచారు. అదేదో సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్లు.. ఇంత ఎవరైనా తింటారా సార్.. మీరు కూడా తినలేరు అంటూ డైలాగ్ చెప్పే పరిస్థితి ఆ కొత్త అల్లుడికి వచ్చింది అని చెప్పాలి. కొత్తగా వచ్చిన అల్లుడికి గోదారోళ్ళ మర్యాదలు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేసి ఇక ఆ టేబుల్ మొత్తం ఎక్కడా ఖాళీ లేకుండా అన్ని వంటకాలతో నింపేశారు... ఏలూరుకు చెందిన దంపతులు.

ఏలూరు నగరం దొంగల మండపానికి చెందిన భీమారావు, చంద్రలీల దంపతులు గతేడాది ఏప్రిల్ లో అనకాపల్లికి చెందిన మురళీతో తమ కుమార్తెకు వివాహం జరిపించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కుమార్తె, అల్లుడు ఇంటికి రాగా....అల్లుడికి కనీ వినీ ఎరుగని రీతిలో ఏదైనా చేయాలని సంకల్పించిన అత్తగారు.....పిండివంటలు, కూరలు, వేపుళ్లు, స్వీట్లు, పండ్లు, శీతల పానీయాలు, కారప్పొడులు, పచ్చళ్లు.....ఇలా 379 రకాల వంటకాలను సిద్ధం చేశారు.

వాటన్నింటినీ దంపతులిద్దరూ అటు అల్లుడు, ఇటు కూతురికి కొసరి కొసరి తినిపించారు. గోదావరి జిల్లాలు సంస్కృతి, సంప్రదాయాలకు నిలయాలనీ... ఇక్కడి అతిథి మర్యాదలను వైభవంగా చాటాలనే ఉద్దేశంతోనే ఇన్ని రకాల వంటకాలను సిద్ధం చేసి తమ అల్లుడిని ఆశ్చర్యపరిచినట్లు భీమారావు దంపతులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.