Farmers Worried on Crops Over Power Cuts in AP: వర్షాభావ పరిస్థితులతో తల్లడితున్న రైతులకు.. గోరుచుట్టు మీద రోకటిపోటులా.. విద్యుత్ కోతలు కలవరపెడుతున్నాయి. రోజుకు కనీసం 5 గంటలు కూడా సక్రమంగా విద్యుత్ అందక ఎకరా పొలానికి కూడా నీరు పారడం లేదని వాపోతున్నారు. పాలుపోసుకునే దశలో ఉన్న వరితో పాటు ఇతర పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ సరిగా అందక పంటలు కళ్లెదుటే ఎండిపోతున్నాయి. ఏలూరు జిల్లా.. జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో 40 వేలకు పైగా వ్యవసాయ విద్యుత్ మోటార్లు ఉన్నాయి. ప్రస్తుతం వరిచేలు పాలుపోసుకునే దశలో ఉన్నాయి. పొగాకు నాట్లు వేస్తున్నారు. మొక్కజొన్న, మిర్చి, ఉద్యాన పంటలు, కూరగాయల తోటలకు నీటి అవసరం బాగా పెరిగింది. ఐతే.. కరెంటు కోతలు, విద్యుత్ సరఫరా లోపాలతో.. పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
జంగారెడ్డిగూడెం, కామరకోట విద్యుత్ ఉపకేంద్రంలో.. రెండు ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతుకు గురయ్యాయి. 2 నెలలు దాటినా వాటి స్థానంలో కొత్తవి అమర్చకపోవడంతో.. ప్రస్తుతం పెరిగిన డిమాండ్ మేరకు సరఫరా చేయలేక ఆ శాఖ చేతులెత్తేసింది. 2.7మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే 2.5 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా అవుతోంది. ఫలితంగా రోజు మొత్తం ఐదు గంటలకు విద్యుత్ సరఫరా కుదించారు.
కరెంటు వచ్చిన వెంటనే తడులు ప్రారంభించినా.. చేలు సగం తడిచేలోపే కరెంట్ పోతుందని రైతులు వాపోతున్నారు. పంట బోదెల్లో నీరు సమృద్ధిగా ప్రవహించి చాలా రోజులైందని, కరెంటు కోసం పొలాల్లోనే పడిగాపులు పడాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందించి ఆదుకోవాలని.. లేకుంటే పంటలు ఎండి తీవ్రంగా నష్టపోతామని రైతులు చెబుతున్నారు.
Famers Protest For Current on Road : ఎండుతున్న పంటలు.. మండుతున్న రైతులు.. విద్యుత్ కోతలపై కన్నెర్ర
"రోజుకు కనీసం 5 గంటలు కూడా సక్రమంగా విద్యుత్ అందక ఎకరా పొలానికి కూడా నీరు పారడంలేదు. దీంతో పాలుపోసుకునే దశలో ఉన్న వరితో పాటు ఇతర పంటలు ఎండిపోతున్నాయి. విద్యుత్ సరిగా అందక పంటలు కళ్లెదుటే ఎండిపోతున్నాయి. ప్రస్తుతం వరిచేలు పాలుపోసుకునే దశలో ఉన్నాయి. పొగాకు నాట్లు వేస్తున్నారు. మొక్కజొన్న, మిర్చి, ఉద్యాన పంటలు, కూరగాయల తోటలకు నీటి అవసరం బాగా పెరిగింది. ఐతే.. కరెంటు కోతలు, విద్యుత్ సరఫరా లోపాలతో.. పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయి. కరెంటు వచ్చిన వెంటనే తడులు ప్రారంభించినా.. చేలు సగం తడిచేలోపే కరెంట్ పోతోంది. పంట బోదెల్లో నీరు సమృద్ధిగా ప్రవహించి చాలా రోజులైంది. విద్యుత్ కోసం పొలాల్లోనే పడిగాపులు పడాల్సి వస్తోంది." - రైతుల ఆవేదన
Power Cuts in YCP Government అప్రకటిత 'జగనన్న విద్యుత్ కోతల' పథకంతో.. అల్లాడిపోతున్న జనం!