ETV Bharat / state

Eluru Roads: అధ్వాన దారులు.. ఎటూచూసిన గుంతలే గుంతలు.. ఎన్నాళ్లీ ఇక్కట్లు..? - meems on roads in ap

Damaged Roads in Eluru: జులై నాటికి రాష్ట్రంలోని రహదారులను అభివృద్ధి చేయాలి.. మరమ్మతులకు ముందు, ఆ తర్వాత అంటూ ఫొటోలు పెట్టాలంటూ సీఎం జగన్‌.. రోడ్లు, భవనాల శాఖపై సమీక్షలో అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. జులై వచ్చింది.. కానీ ముఖ్యమంత్రి ఆదేశాలు అమలైన దాఖలాలు మచ్చుకైనా కనిపించడంలేదు. కొత్త రోడ్ల నిర్మాణం మాట అటుంచితే.. కనీసం పాడైన రహదారులకు మరమ్మతులు చేయని దుస్థితి. ఏలూరు జిల్లాలో గత్యంతరం లేక గోతుల రోడ్లపైనే రాకపోకలు సాగిస్తూ ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.

Damaged Roads in Eluru
Damaged Roads in Eluru
author img

By

Published : Jul 22, 2023, 9:53 AM IST

అధ్వాన దారులు.. ఎటూచూసిన గుంతలే గుంతలు.. ఎన్నాళ్లీ ఇక్కట్లు..?

Damaged Roads in Eluru: కీలకమైన రహదారుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యాన్ని చూపుతూనే ఉంది. ఏలూరు జిల్లాలో గడిచిన నాలుగు సంవత్సరాలలో జిల్లా రహదారులు.. అభివృద్ధి కాదు కదా.... కనీసం మరమ్మతులకు కూడా నోచుకోని పరిస్థితి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఏ రోడ్లు చూసినా అంతా గోతులమయమే. వర్షాకాలం రావడంతో గోతులు పడిన రోడ్లపై ప్రయాణం.. ప్రజల్ని మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. తేలికపాటి వర్షానికే జిల్లాలోని చాలా రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు.

"అటు చాట్​పర్రు-మాదేపల్లి మధ్యలో ఉన్న రోడ్డు ఎస్సీ ఏరియా. ఈ రోడ్డును గత నాలుగు సంవత్సరాల నుంచి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇటుసైడు భారీ వాహనాలు వెళ్లడానికి పర్మిషన్​ లేదు. కానీ అవేమి లేకుండా పెద్ద పెద్ద వాహనాలు వెళ్తాయి."-కూరపాటి శ్యాంప్రసాద్, ఏలూరు

ఏలూరు నగర పరిధిలోని ఫిల్ హౌస్ పేట 6, 9 డివిజన్ల మధ్య ఉన్న రహదారి.. చిన్న వర్షానికే పూర్తిగా ధ్వంసమైంది. ఏలూరు నుంచి మాదేపల్లి, కైకలూరు, ఆకివీడు, ఉండి, భీమవరం, పాలకొల్లు, నరసాపురం వరకు ఆర్టీసీ బస్సులతో సహా ఏ వాహనమైనా ఈ మార్గం నుంచే ప్రయాణించాలి. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారి భారీ గోతులతో బెంబేలెత్తిస్తోంది. స్థానికులు చేపలు పడుతూ నిరసన తెలిపారంటే.. ఏ స్థాయిలో ఛిద్రమైందో అర్థం చేసుకోవచ్చు.

ఏలూరు నడిబొడ్డున ఉన్న బిర్లా భవన్ కూడలి నుంచి తూర్పువీధి, మాదేపల్లి, చాటపర్రు సహా లంక గ్రామాలకు వెళ్లే రహదారి ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోలేదు. నిత్యం వేల మంది ఈ రోడ్డు ద్వారానే నగరానికి రాకపోకలు సాగిస్తుంటారు. నగర పాలక సంస్థ, ఆర్ అండ్ బీ అధికారులు పట్టించుకోవడం లేదు. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాదారుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి.

"మాకు ఈ రోడ్డు వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎప్పుడు ఏ బండి కిందపడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. రాత్రి సమయంలో గుంతలు కనపడక చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారు. స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నారు."-ప్రసాద్​, ఉండ్రాజవరం

ఏలూరు నుంచి ఉండ్రాజవరం మీదుగా జాతీయ రహదారికి వెళ్లే మార్గం మరింత అధ్వానంగా తయారైంది. భీమడోలు మండలం గుండుగొలను వద్ద వంతెన పడిపోవడంతో.. నిత్యం వందల మంది చుట్టు పక్కల గ్రామస్థులు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు.. ఈ మార్గం మీదుగానే నగరానికి వెళ్తుంటారు. వాహనాల సంఖ్య అధికంగానే ఉంటుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగా ప్రధాన రహదారి.. కచ్చా రోడ్డును తలపిస్తోందని స్థానికులు అంటున్నారు. రోడ్ల అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని ప్రజలు మండిపడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.