AP CM Jagan mohan Reddy visited Polavaram displaced areas: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా వరద బాధితులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో.. వరదలు వచ్చినప్పుడల్లా తీవ్ర కష్టాలు పడుతున్నామని పోలవరం ముంపు బాధితులు సీఎం ఎదుట వారి గోడును వెళ్లబోసుకున్నారు. తమకు ఇవ్వాల్సిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని త్వరగా ఇప్పించాలని కోరారు. దాంతోపాటు వచ్చే జూన్ కల్లా తమను సురక్షిత ప్రాంతానికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం బాధితుల గోడు విన్న సీఎం జగన్.. నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు.
ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీకి కేంద్రం అనుమతి..!.. పోలవరం ముంపు బాధితులతో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుతో ముంపునకు గురైన ప్రతి నిర్వాసితుడికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల వరదలతో ముంచెత్తిన ప్రాంతాలను పరిశీలించామన్న ఆయన.. బాధితులను అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పోలవరం నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి ఈ నెలాఖరులోగా కేంద్రం అనుమతి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం నిధులతో పాటు రాష్ట్ర నిధులు కలిపి నిర్వాసితులకు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు.
Chandrababu on Polavaram: జగన్ అనే శని పోతే తప్ప.. పోలవరం కల సాకారం కాదు: చంద్రబాబు
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం జగన్.. ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాల కారణంగా భారీగా వరదలు వచ్చిన విషయం తెలిసిందే. వరదలు ముంచెత్తడంతో పోలవరం నిర్వాసితులు నానా అవస్థలు పడ్డారు. ప్రభుత్వం స్పందించి తమకు సాయం చేయాలంటూ బాధితులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఈరోజు ముఖ్యమంత్రి జగన్ గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తాడేపల్లి నుంచి అల్లూరి జిల్లా కూనవరంకు చేరుకున్న జగన్.. బాధితులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు.
సాయం అందలేదని ఒక్క ఫిర్యాదు రాకూడదు.. సమావేశంలో సీఎం జగన్.. బాధితులకు పలు రకాల హామీలు ఇచ్చారు. ముఖ్యంగా వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. నిర్వాసితులందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వరదల సమయంలో అధికారులు వారం పాటు గ్రామాల్లోనే ఉన్నారన్న సీఎం.. ప్రజలకు మంచి జరగాలన్నదే తమ లక్ష్యమన్నారు. సాయం అందలేదని ఏ ఒక్కరి నుంచి ఫిర్యాదు రాకూడదన్నారు. పోలవరం ముంపు బాధితుల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ త్వరలోనే చేతికందిస్తామన్నారు. దాంతోపాటు మరో 48 ఆవాసాలను మొదటి దశలోకి తీసుకొస్తామని వెల్లడించారు.
అనుమతి లభించిన వెంటనే సాయం అందిస్తాం.. వరదలు వచ్చినప్పుడల్లా తీవ్ర కష్టాలు పడుతున్నామని పోలవరం ముంపు బాధితులు సీఎం ఎదుట గోడు వెల్లబోసుకున్నారు. తమకు ఇవ్వాల్సిన ప్యాకేజీని త్వరగా ఇప్పించాలని కోరారు. వచ్చే జూన్ కల్లా తమను సురక్షిత ప్రాంతానికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో సీఎం జగన్ స్పందిస్తూ.. పోలవరం నిర్వాసిత ప్యాకేజీకి త్వరలో ఆమోదం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనుమతి లభించిన వెంటనే బాధితులకు నిధులను అందిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
వరద ప్రాంతాల ఫొటో ప్రదర్శనను తిలకించిన జగన్.. ఆ తర్వాత కోతులగుట్ట హెలిప్యాడ్ నుంచి కుక్కునూరు మండలం గొమ్ముగూడెం చేరుకున్న సీఎం.. అక్కడ వరద ప్రాంతాల్లో పర్యటించారు. వ్యూ పాయింట్‌లో గోదావరిని.. తర్వాత వరద ప్రాంతాల ఫొటో ప్రదర్శనను తిలకించారు. బాధిత కుటుంబాలతో చర్చించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Polavaram project భూమితోపాటు 10 లక్షల ప్యాకేజీ ఇస్తామన్న జగన్.. ఇప్పుడు ఎక్కడా?: పోలవరం నిర్వాసితులు