ETV Bharat / state

ఉచిత విద్యతో ఉన్నత శిక్షణ..పేదల పాలిట కల్పవల్లిగా ఆగిరిపల్లి హీల్ పాఠశాల.. - హీల్ స్కూల్ ఆంధ్రప్రదేశ్​

HEAL School: ఆ స్కూల్ ఎంతో ప్రత్యేకమైనది. ఉచితంగా విద్యను అందిస్తోంది. కేవలం విద్యను మాత్రమే కాదు అంతకు మించి.. మంచిని చేస్తూ ఆకట్టుకుంటోంది. అనాథలను, అంధులను, జీవితంలో నిర్లక్ష్యానికి గురైన పిల్లలను, ప్రేమను పొందలేక పోయిన వారిని.. ఇలా ఎందరినో ఆ స్కూల్ స్వాగతిస్తోంది. వారిని ఉన్నతమైన విలువలు కలిగిన పౌరులుగా తీర్చిదిద్దుతోంది. అదే ఆంధ్రప్రదేశ్​లో ఉన్న హీల్ స్కూల్. దీని ప్రత్యేకతలు ఏంటంటే..?

HEAL School
హీల్ స్కూల్
author img

By

Published : Mar 18, 2023, 4:41 PM IST

Updated : Mar 18, 2023, 8:06 PM IST

HEAL School: ఆ స్కూల్ అనాథలకు, అత్యంత పేద పిల్లలకు, అదే విధంగా అంధులకు, వివిధ కారణాల వలన జీవితంలో ప్రేమకు నోచికోని వారి కోసం ఏర్పరచినది. ఇటువంటి వారికి ఆ స్కూల్ స్వాగతం పలుకుతోంది. ప్రేమను అందిస్తోంది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆదుకుంటోంది. ఆ స్కూల్ పేరే హీల్ స్కూల్. ఇంతకీ హీల్ అంటే ఏంటో తెలుసా.. హీల్.. అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం, విద్య అందించాలనే మంచి దృక్పథంతో.. పేద పిల్లలకు, అనాధలను ఉచితంగా విద్యను అందిస్తోంది.

ఈ పాఠశాలలో.. పిల్లలు చిన్నప్పటి నుంచి మిస్ అయిన ప్రేమను వారికి అందిస్తారు. వారిని సంతోషంగా ఉంచుతారు. జీవితంలో వారి అభివృద్ధికి కొత్త బాటలు వేస్తారు. పిల్లల ఆసక్తులను గుర్తించి.. వారిని ఆ దిశగా ప్రోత్సహిస్తారు. ఇందులోని పిల్లలకు.. తల్లిదండ్రులు, ఆత్మీయులు ఏదైతే ప్రేమను ఇస్తారో.. ఆదే ప్రేమను ఇక్కడ ఉపాధ్యాయులు, సిబ్బంది ఇస్తారు.

ఎక్కడ ఉందంటే: మరి ఇంత ప్రేమను ఇచ్చే ఈ హీల్ స్కూల్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలని ఉందా.. ఎక్కడో కాదండి మన ఆంధ్రప్రదేశ్​లోనే. 30 ఎకరాల క్యాంపస్​లో చూట్టూ ఉన్న సరస్సు, పచ్చటి పొలాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇందులోనే విద్యార్థులకు అవసరమైన ఆహారాన్ని, కూరగాయలను కూడా సహజ సిద్ధంగా పండిస్తున్నారు. ఏలూరు జిల్లాలో ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో ఉంది. దీనికి విజయవాడ విమానాశ్రయానికి 15 కిలోమీటర్ల దూరం మాత్రమే. ఈ క్యాంపస్​లోనే అన్ని సౌకర్యాలు ఉన్నాయి.

ఇంత అందమైన హీల్ ప్యారడైజ్ స్కూల్​లో పిల్లలకు అత్యుత్తమ విద్య, పిల్లలు స్వతహాగా బతికే విధంగా తీర్చుదిద్దుతారు. కేవలం చదువులో మాత్రమే కాకుండా.. ఆటలు, పాటలు ఇలా వివిధ రకాలుగా పిల్లలను ఎంకరేజ్ చేస్తారు. దీని ద్వారా వెనుకబడిన పిల్లలకు ఉన్నతమైన భవిష్యత్తును అందించడంలో తన వంతు కృషి చేస్తోంది ఈ హీల్ ప్యారడైజ్ స్కూల్. ఇందులోని పిల్లలకు సీబీఎస్​ఈ సిలబస్​తో ఇంగ్లీష్ మీడియం విద్యతో.. ఉచితంగా ఆహారం, వసతి అందిస్తున్నారు.

ప్రస్తుతం ఈ పాఠశాలలో 670 మంది వరకూ పిల్లలు చదువుతున్నారు. ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకూ పిల్లలు ఉన్నారు. ఇక ఇప్పుడేమో ఈ పాఠశాలలో ఒకటి, రెండవ తరగతి పిల్లలను జాయిన్ చేయడానికి అడ్మిషన్లు జరుగుతున్నాయి. అదే విధంగా 3వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లలకు సీట్లు పరిమితంగానే ఉంటాయి. తల్లీ, తండ్రి ఇద్దరూ లేని పిల్లలను ఒకటవ తరగతి నుంచి 8వ తరగతి వరకూ ఎడాది పొడవునా జాయిన్ చేసుకుంటారు.

ఎలా జాయిన్ చేసుకుంటారంటే: మరి ఇందులో ఎవరెవరిని జాయిన్ చేసుకుంటారంటే.. 18 సంవత్సరాలలోపు పిల్లలను జాయిన్ చేసుకుంటారు. ఎవరికైతే చిన్నప్పటి నుంచి సరైన పోషణ, తల్లిదండ్రుల ప్రేమ పొందని వారు ఉంటారో వారిని తీసుకుంటారు. వీరిలో కూడా ముందుగా.. తల్లీ, తండ్రీ ఇద్దరూ లేని వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు.

తరువాత తల్లి లేదా తండ్రి లేని వారిని జాయిన్ చేసుకుంటారు. అదే విధంగా చిన్నప్పటి నుంచి ఎవరైతే తల్లిదండ్రుల ప్రేమను పొందకుండా తీవ్రంగా నిర్లక్ష్యానికి గురయ్యారో అటువంటి వారిని తీసుకుంటారు. మరికొంత మందిని అద్భుతమైన తెలివి ఉండి.. వెనుకబడిన వారు అయితే వారిని కూడా జాయిన్ చేసుకుంటారు.

ప్రత్యేకతలు: ఈ స్కూల్ ప్రత్యేకతలు ఎంటంటే.. మంచి ఉపాధ్యాయులతో, అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను బోధిస్తారు. ఆన్​లైన తరగతులు కూడా నిర్వహిస్తారు. ప్రయోగశాలలు.. సుమారు పది వేలకు పైగా పుస్తకాలతో లైబ్రరీ. బాల, బాలికలకు ప్రత్యేకమైన హాస్టళ్లు ఉన్నాయి. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు వివిధ రకాల ఆటల కోసం ప్రత్యేకమైన సదుపాయాలు ఇందులో ఉన్నాయి.

సత్తాచాటుతున్న పిల్లలు: ఇప్పటికే ఈ హీల్ స్కూల్ పిల్లలు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నారు. డ్యాన్స్, పాటలు, నాటికలు వేయిస్తూ పిల్లలను సంతోషంగా ఉంచుతున్నారు. వివిధ రకాల ప్రతిభా పరీక్షలలో కూడా మంచి ర్యాంకులు సాధిస్తూ.. ఉత్తమమైన యూనివర్సిటీలలో చదువుతున్నారు. క్రీడలలో ఆంధ్రప్రదేశ్​కు జాతీయ స్థాయిలో పతకాలు సాధించి పెడుతున్నారు.

ప్రేమను అందించేది వారే: ఇక్కడ పనిచేసే సిబ్బంది కూడా.. పిల్లలను వారి సొంత పిల్లలుగా భావిస్తారు. పిల్లలకు.. వారి ఇంటి దగ్గర.. వారి తల్లిదండ్రుల దగ్గర దూరమైన ప్రేమను అందిస్తారు. పిల్లలను సొంతంగా స్థిరపడే విధంగా తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే ఈ హాల్ స్కూల్ మద్దతుతో వందకు పైగా పిల్లలు డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వంటి కోర్సులను అభ్యసిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 18, 2023, 8:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.