ETV Bharat / state

దేవుడి సాక్షిగా.. అనపర్తి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఏమని ప్రమాణం చేశారంటే? - అనపర్తి వైకాపా ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి అవినీతి ఆరోపణలు న్యూస్

bikavolu
bikavolu
author img

By

Published : Dec 23, 2020, 2:55 PM IST

Updated : Dec 23, 2020, 7:42 PM IST

14:52 December 23

ఆన..పర్తి రాజకీయం.. సత్యప్రమాణాలతో గరం గరం

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య సవాళ్లతో వాతావరణం వేడెక్కింది. అవినీతి ఆరోపణలపై బిక్కవోలు శ్రీలక్ష్మీగణపతి ఆలయంలో ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు ప్రమాణం చేశారు. ఈ సమయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పరిస్థితులు చేయిదాటకుండా పోలీసులు అడ్డుపడ్డారు. ప్రమాణం అనంతరం ఇరువురు నేతలను స్వగ్రామాలకు పంపారు.

సవాల్, ప్రతిసవాళ్లతో అనపర్తి రాజకీయాన్ని వేడిక్కించిన వైకాపా ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి, తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయంలో ప్రమాణం చేశారు. కొద్దిరోజుల క్రితం సూర్యనారాయణరెడ్డిపై నల్లమిల్లి అవినీతి ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన సూర్యనారాయణరెడ్డి... బిక్కవోలులోని శ్రీలక్ష్మీగణపతి ఆలయంలో ప్రమాణానికి సిద్ధమని సవాల్ విసరగా రామకృష్ణారెడ్డి దీన్ని స్వీకరించారు.

ఈ క్రమంలో ఇరువురి ప్రమాణానికి పోలీసులు అనుమతించారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు సూర్యనారాయణరెడ్డి, సాయంత్రం నాలుగున్నర గంటలకు రామకృష్ణారెడ్డి.... ప్రమాణం చేసేందుకు అంగీకరించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా నేతల ఇళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు... నేతలను గృహ నిర్బంధం చేశారు. పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షక భటుల తీరుకు నిరసనగా ఇంట్లోనే ఆందోళన చేశారు.

నలుగురికి మాత్రమే అనుమతి

మధ్యాహ్నం నేతలిద్దరూ ప్రమాణం చేసేందుకు ఆలయానికి చేరుకోగా... ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ముందుగా ఎమ్మెల్యేని గుడికి తీసుకొచ్చిన పోలీసులు... ఆయనతో పాటు నలుగురిని మాత్రమే ఆలయంలోకి అనుమతించారు. తర్వాత నల్లమిల్లితో పాటు మరో నలుగురిని గుడిలోకి పంపారు. దేవుని ఎదుట ప్రమాణం చేసే సమయంలో ఇద్దరు నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

సత్య ప్రమాణం చేయలేదు

తెదేపా నేత రామకృష్ణారెడ్డి సత్యప్రమాణం చేయలేదని.. ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి అన్నారు. తాను గుడిలో చిత్తశుద్ధితో సత్య ప్రమాణం చేశానని స్పష్టం చేశారు.  తమ కార్యకర్తలు నిలదీయడంతో తూతూ మంత్రంగా చేశారని విమర్శించారు. రామకృష్ణారెడ్డి సతీమణి సత్య ప్రమాణం చేయలేదని ఆరోపించారు.

నాపై దుర్భాషలాడారు

సూర్యనారాయణ రెడ్డి సత్య ప్రమాణం చేసే వరకు తాను సంయమనం పాటించానని కానీ తాను ప్రమాణం చేస్తుంటే ఎమ్మెల్యే, ఆయన సతీమణి దుర్భాషలాడారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తన భార్య ప్రమాణం చేస్తే చేయలేదని ఎమ్మెల్యే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.

ప్రమాణం తర్వాత నేతలిద్దరినీ పోలీసులు వారి స్వగ్రామాలకు పంపారు. మరో మూడు రోజుల పాటు బిక్కవోలు, అనపర్తిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు ప్రకటించారు.

పరస్పర ఆరోపణలతో..

ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి.. నియోజకవర్గంలో గ్రావెల్‌ మాఫియాగా మారారని నాటుసారా, పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నారని నల్లమిల్లి ఆరోపించారు. నల్లమిల్లి హయాంలోనే అవకతవకలు జరిగాయని... సత్తి సూర్యనారాయణరెడ్డి ఆరోపించారు. దీనిపై పరస్పర సవాళ్ల మధ్య ఇరువురు నేతలు సత్య ప్రమాణం చేశారు.

ఇదీ చదవండి: అనపర్తి, బిక్కవోలులో తీవ్ర ఉద్రిక్తత.. 144 సెక్షన్ విధింపు

Last Updated : Dec 23, 2020, 7:42 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.