తూర్పుగోదావరి జిల్లాలో జగనన్న కాలనీల కింద ఈనెల 25న పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి పక్కా ఇళ్లు నిర్మించేందుకు వైకాపా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అమలాపురం డివిజన్లో మొదటి దశలో భాగంగా 136 లే అవుట్ల ద్వారా 18,575 మంది లబ్ధిదారులకు పక్కా ఇళ్లు నిర్మించేందుకు సమాయత్తమైంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని అమలాపురం డివిజన్ హౌసింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గణపతి స్పష్టం చేశారు. తొలి దశలో గూడా పరిధిలోకి వచ్చే ప్రాంతాలను ఎంపిక చేశామన్నారు.
గుడా (గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో పక్కా ఇళ్లు నిర్మించేందుకు అనుమతులు వచ్చాయని ఆయన వెల్లడించారు. పి.గన్నవరం, సఖినేటిపల్లి, మలికిపురం, అంబాజీపేట, అయినవెల్లి, కొత్తపేట, కాట్రేనికోనలో ప్రస్తుతానికి పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు.
ఇదీచదవండి