ETV Bharat / state

నేల తల్లి అంటే ప్రాణం.. వ్యవసాయమంటే ఇష్టం - తూర్పు గోదావరి ఆర్గానిక్ ఫార్మింగ్ న్యూస్

ఐటీఐ చదివి వ్యవసాయంపై మక్కువతో పంటల మార్పిడి విధానంతో ఏటా మూడు రకాల పంటలు పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు... తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామానికి చెందిన యువ రైతు ప్రగడ రాంబాబు. కూరగాయలు పండిస్తూ తాను ఆర్థికంగా నిలదొక్కుకోవడమే గాకుండా పరిసర గ్రామ రైతులకు స్ఫూర్తిగా ఉన్నాడు.

young man organic farming in east godavari

author img

By

Published : Jul 28, 2020, 12:13 AM IST

నరేంద్రపురం నుంచి కలవచర్ల వెళ్లే రహదారిలో ఎనిమిది ఎకరాల్లో పందిళ్లపై వివిధ రకాల కూరగాయలు వేలాడుతూ ఆకుపచ్చని పంటతో కళకళలాడుతూ దర్శనమిస్తుంది. నరేంద్రపురం గ్రామానికి చెందిన ప్రగడ రాంబాబు.. ఎనిమిది ఎకరాల పంట భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఉద్యాన శాఖ అధికారుల సలహాలతో సేంద్రియ ఎరువులను అధికంగా ఉపయోగిస్తూ.. పందిరి సేద్యం ద్వారా వివిధ రకాల కూరగాయలు పండిస్తున్నాడు. పంట భూమి వద్దే కూరగాయల దుకాణాన్ని ఏర్పాటు చేసుకుని తాను పండించిన కూరగాయలను నామమాత్రపు లాభంతో విక్రయిస్తున్నాడు. నాణ్యమైన ఉత్పత్తులు కావడం తాజా సరకు సైతం అందుబాటులో ఉండటం అందరూ రాంబాబు దగ్గరకే వస్తున్నారు.

రాంబాబు.. ఏటా మూడు పంటలు పండిస్తున్నప్పటికీ మొదటి రెండు పంటలు బీర, దొండ, కాకర , సొర వేశారు. అంతర పంటలుగా మిర్చి, వంకాయ, బొబ్బర్లు పండిస్తున్నారు. రెండేళ్లలో ఆరు రకాల పంటలు వేశారు. కూరగాయల సాగుకు పందిరి సేద్యంలో మాల్పింగ్ షీట్ లను ఉపయోగించి విత్తనాలు వేసేందుకు వీలుగా ఆ సీట్లకు అక్కడికక్కడే రంధ్రాలు చేశారు. అలా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటి వృథాను అరికట్టారు. మొక్కలకు ఎరువులను నీటిలో కలిపి డ్రిప్ పైపుల ద్వారా అందిస్తున్నారు.

ఉద్యాన శాఖ అధికారులు ప్రోత్సాహం ఎంతో

ప్రారంభంలో కర్రలతో పందిళ్లు వేసి కూరగాయలు సాగు చేసేవాడినని.. ప్రకృతి వైపరీత్యాల వల్ల పందిళ్లు పడిపోయి నష్టపోయే వాడినని రాంబాబు చెప్పారు. దాని వల్ల ఖర్చులు ఎక్కువగా అయ్యేవన్నారు. రాజానగరం ఉద్యాన శాఖ అధికారులు ఇచ్చిన సలహాలు సూచనలు పాటించానని తెలిపారు. ప్రభుత్వం కల్పించిన రాయితీని ఉపయోగించుకుని సిమెంట్ స్తంభాలు, ఇనుప తీగలతో పందిళ్లు ఏర్పాటు చేసుకున్నానని... పంట మార్పిడి విధానంలో వరి పంట సాగు చేసేందుకు అవకాశం ఏర్పడిందని.. వేసవిలో మినుములు పెసలు అంతరపంటగా సాగు చేస్తున్నామన్నారు.

లాక్ డౌన్ సమయంలోనూ కూలీలకు ఉపాధి..

లాక్ డౌన్ లో అనేకమంది కూలీలు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతుంటే... చాలా మందికి ఉపాధి కలుగుతుందని... రాంబాబు చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.