రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రులు, అధికారులు ప్రారంభించారు. అయితే కొన్నిచోట్ల లబ్ధిదారుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం మురారి గ్రామస్తులు.. తమకు దక్కిన ఇళ్ల స్థలాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార వైకాపా శ్రేణులతో కలిసి లబ్ధిదారులు జాతీయ రహదారిపై బైఠాయించారు. ఆందోళన చేశారు.
అనర్హులకు ఇళ్ల పట్టాలు ఇచ్చి అర్హులను విస్మరించారని పేర్కొన్నారు. ఈ ఆందోళనతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు ఆందోళనకారులతో మాట్లాడారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నిరసన విరమింపజేశారు.
ఇదీ చూడండి: