తూర్పుగోదావరి జిల్లాలో అధికార వైకాపాకు షాక్ తగిలింది. రామచంద్రాపురం నియోజకవర్గం కాజులూరు మండలంలో.. సుమారు 100 మంది నాయకులు.. వైకాపాకు రాజీనామా చేశారు. మంత్రి వేణుగోపాలకృష్ణ నియోజకవర్గంలోనే ఈ మూకుమ్మడి రాజీనామాలు జరగడం చర్చనీయాంశంగా మారింది.
కాజులూరు మండలంలో రాయుడు లీలాశంకర్ ఆధ్వర్యంలో.. ఆ పార్టీ ప్రధాన నాయకులు వైకాపాకు రాజీనామా చేశారు. 2019లో తోట త్రిమూర్తులుపై అభిమానంతో వైకాపాలో చేరిన తమకు ఏ విధమైన గుర్తింపు లభించడంలేదని వాపోయారు.
ఇదీ చదవండి: