ETV Bharat / state

ఉమెన్‌ సేఫ్టీ సిస్టమ్‌ రూపొందించిన ఇంజినీరింగ్​ విద్యార్థులు - women safety system latest news

యువతులు, మహిళలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వారికి ఆపత్కాలంలో ఉపయోగపడేలా ఉమెన్‌ సేఫ్టీ సిస్టమ్‌ తయారు చేశారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ప్రగతి ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన ఇంజినీరింగ్​ విద్యార్థులు దీన్ని రూపొందించారు.

women safety system
ఉమెన్‌ సేఫ్టీ సిస్టమ్‌
author img

By

Published : May 3, 2021, 12:59 PM IST

ఇటీవల యువతులు, మహిళలపై దాడులు పెరగడం, కొన్నిసార్లు వారి ప్రాణాలకే ముప్పు ఏర్పడటం చూస్తున్నాం. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు సులువుగా అత్యవసర సహాయం పొందేలా ఇంజినీరింగ్‌ విద్యార్థినులు ఉమెన్‌ సేఫ్టీ సిస్టమ్‌ తయారు చేశారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ప్రగతి ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన ఈసీఈ విద్యార్థులు షర్మిల, పల్లవి, స్వర్ణ, ఫర్హిన్‌, బిందు ఈ సిస్టమ్‌ను రూపొందించారు. దీని తయారీలో జీఎస్‌ఎం మాడ్యూల్‌, మైక్‌ కంట్రోలర్‌, బటన్‌ స్విచ్‌, 3.7 లిథియం అయాన్‌ బ్యాటరీని ఉపయోగించారు.

ఇలా పనిచేస్తుంది: అత్యవసర సమయాల్లో బటన్‌ నొక్కిన వెంటనే జీఎస్‌ఎం మాడ్యూల్‌లో అమర్చిన సిమ్‌ కార్డు ద్వారా ముందుగా మనం ఎంపిక చేసిన అత్యవసర నంబర్లకు సమాచారం చేరుతుంది. ఈ పరికరాన్ని మహిళలు, యువతులు పాకెట్‌లో, చేతిలో, దుస్తుల్లో ఎక్కడైనా అమర్చుకుని అత్యవసర సమయాల్లో సహాయం పొందవచ్చని ప్రాజెక్టు ఇంజినీర్‌ బి.శేషగిరిరావు వివరించారు.

ఇదీ చదవండి: బస్సుకు వాహనాలు అడ్డంపెట్టిన యువకులు... అదుపులోకి తీసుకున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.