ETV Bharat / state

wife fight: 'పదేళ్లు కాపురం చేశాడు..ఇప్పుడు వదలించుకోవాలనుకుంటున్నాడు' - భర్త ఇంటి ఎదుట భార్య ధర్నా

తూర్పు గోదావరి జిల్లాలో భర్త ఇంటి ఎదుట ఓ మహిళ నిరసన దీక్ష చేపట్టింది. పది సంవత్సరాలు కాపురం చేసి.. తనను, బిడ్డను వదిలించుకోవాలని చూస్తున్నాడని ఆమె ఆరోపించింది. ఆరు నెలల క్రితం తన భర్త.. మరో మహిళను వివాహం చేసుకున్నాడని తెలిపింది.

wife protest
wife protest
author img

By

Published : Jun 12, 2021, 6:20 PM IST

పదేళ్లు కాపురం చేశాడు.. భార్య, బిడ్డతో సంతోషంగా జీవితం గడుస్తోంది. కానీ అతని బుర్రలో వేరే ఆలోచన వచ్చింది. వేరే వివాహం చేసుకుంటే అదనం కట్నం వస్తుందని భావించాడు.. దీంతో పదేళ్లు కాపురం చేసిన భార్యనే వదిలించుకోవాలనుకున్నాడు. బిడ్డ ముఖం చూసైనా ఆయన మనసు కరగలేదు. దీంతో చేసేదేమీ లేక భార్య భర్తపై పోరాటానికి దిగింది. భర్త ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టిన ఘటన తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో జరిగింది.

'పది సంవత్సరాలు కాపురం చేశాడు.. వదలించుకోవాలని చూస్తున్నాడు'

ధర్మవరం గ్రామానికి చెందిన జువ్వాల నూకరాజకు శ్రీలక్ష్మితో 2011లో వివాహం జరిగింది. తనతో పదేళ్లు కాపురం చేసి.. ఆరు నెలల క్రితం మరో మహిళను రహస్యంగా వివాహం చేసుకున్నాడని ఆమె ఆరోపించింది. న్యాయం చేయాలని కోరుతూ.. తన పాపతో కలిసి భర్త ఇంటి ఎదుట నిరసన చేపట్టింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన తన భర్త కట్నం కోసమే వేరే వివాహం చేసుకున్నాడని శ్రీలక్ష్మి ఆరోపించింది.

ఇదీ చదవండి:దారుణం: మూడేళ్ల చిన్నారిని గొంతుకోసి హత్య చేసిన మేనమామ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.