ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామం సుబ్బారావు కాలనీలో భర్త శరకణం శివరామకృష్ణ ఇంటి ముందు పావని అనే వివాహిత నిరాహార దీక్ష చేపట్టింది. నమ్మించి పెళ్లి చేసుకుని..ఇప్పుడు తనని వదిలేశాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరిగే వరకూ అక్కడ నుంచి కదిలేది లేదని అంటోంది. తల్లిదండ్రులతో కలిసి ఆమె దీక్ష చేస్తోంది.
అసలేం జరిగింది
పావని, శరకణం శివరామకృష్ణ ఐదేళ్లు ప్రేమించుకున్నారు. వారి వివాహానికి పెద్దలు అంగీకరించలేదు. పావనికి ఆమె బావతో పెళ్లి జరిపించారు. మూడు నెలల తరువాత శివ..పావనిని ఆమె అత్తింటి నుంచి తీసుకొచ్చి..విడాకులకు దరఖాస్తు చేయించాడు. అనంతరం శివ, పావని వివాహం చేసుకున్నారు. కానీ ఆమెను వారి పుట్టింటి వద్దే వదిలేసి..వస్తూ..పోతూ ఉండేవాడు. కొద్ది నెలలు గడిచాక..అత్తింటికి తీసుకెళ్లమని అడగ్గా అతను నిరాకరించాడు.
దీంతో ఆమె నేరుగా అతని ఇంటికి వెళ్లి అడగ్గా.. శివతో పాటు, అతని కుటుంబసభ్యులు ఆమెను కొట్టి, అసభ్యకరంగా మాట్లాడారని బాధితురాలు కన్నీరుమున్నీరవుతోంది. పోలీసులు కూడా విషయం గ్రామ పెద్దల దగ్గర తేల్చుకోమన్నారని పావని చెబుతోంది. శివ ఆమెను వదిలించుకోటానికి ప్రయత్నిస్తున్నాడని...తనకు న్యాయం జరిగేదాకా పోరాడతానని అంటోంది.
ఇదీ చదవండి: