ETV Bharat / state

అనుమానాస్పదస్థితిలో పశ్చిమ్‌బంగా ఇంజినీరు మృతి - మండపేట నేర వార్తలు

అనుమానాస్పదస్థితిలో పశ్చిమ్‌బంగాకు చెందిన ఇంజినీరు ఓ లాడ్జిలో మృతి చెందారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా మండపేట స్థానిక ప్రభుత్వాసుపత్రి సమీపంలో జరిగింది.

west bengal engineer died   under suspicious   in mandapeta
అనుమానస్పదస్థితిలో పశ్చిమ్‌బంగా ఇంజినీరు మృతి
author img

By

Published : Sep 9, 2020, 8:22 AM IST

తూర్పుగోదావరి జిల్లా మండపేట స్థానిక ప్రభుత్వాసుపత్రి సమీపంలో ఉన్న ఒక లాడ్జిలో పశ్చిమ్‌బంగకు చెందిన మెకానికల్‌ ఇంజినీరు అనుమానాస్పదంగా మృతి చెందారు. గుమ్మిలేరు రోడ్డులో ఉన్న ఒక పేపరు మిల్లులో మరమ్మతులు చేసేందుకు పశ్చిమ్‌బంగ హుబ్లీ జిల్లాకు చెందిన ఇంజినీరు కృష్ణానందపాల్‌(78) ఈ నెల 5న మండపేట వచ్చారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని ఓ లాడ్జిలో బస ఉంటున్నారు. సోమవారం పని ముగిసిన తర్వాత సిబ్బంది ఎప్పటిలాగే ఆయనను లాడ్జి వద్ద దిగబెట్టి వెళ్లారు. మంగళవారం ఉదయం తీసుకెళ్లేందుకు గది తలుపు తట్టగా ఎంతకీ తీయకపోవడంతో లాడ్జి సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తలుపులు తెరవగా ఆయన మంచంపై మృతి చెంది ఉన్నారు. గుండెపోటుతో మృతి చెంది ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. లాడ్జి మేనేజరు సుబ్రహ్మణ్యం ఫిర్యాదుపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తోట సునీత తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, బంధువులకు సమాచారం ఇచ్చినట్లు ఎస్సై తెలిపారు.

ఇదీ చూడండి. పేగు పంచావు.. ప్రాణం పోశావు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.